సమంత మ్యాజిక్‌ రిపీట్‌ చేసేందుకు హీరోయిన్‌ ఫిక్స్.. `పుష్ప2` కోసం గ్లామర్‌ బాంబ్‌ని దించుతున్న సుకుమార్‌ ?

`పుష్ప` సినిమాలో సమంత చేసిన మ్యాజిక్‌ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయాలని భావిస్తున్నారు సుకుమార్‌. గ్లామర్‌ బాంబ్‌ని దించుతున్నారు.
 

heroine fix in pushpa 2 for the repeat of samantha magic sukumar import glamour bomb arj

`పుష్ప` సినిమాలో సమంత నర్తించిన `ఊ అంటావా మామ ఊఊ అంటావా మావ` పాట ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమా సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. సమంత ఇందులో డాన్సు చేయడం ఓ ఎత్తైతే, ఇంతటి ఊరమాస్‌ సాంగ్‌ చేయడం మరో విశేషం. పాట లిరిక్‌, మ్యూజిక్‌, అకేషన్‌ సినిమాకి బాగా కలిసొచ్చింది. సినిమా సక్సెస్‌లో ఈ పాట కీలక పాత్ర పోషించింది. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో కూడా అలాంటి పాటని ఆశిస్తారు ఆడియెన్స్. అదే సమయంలో అంచనాలు కూడా నెలకొంటాయి. మొదటి పార్ట్ లోనే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక సెకండ్‌ పార్ట్ లో అంతకు మించి ఉంటుందని భావిస్తుంటారు. 

దర్శకుడు సుకుమార్‌ కూడా `పుష్ప2` లో అంతకు మించి అనేలా ఐటెమ్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. అందుకోసం ఏకంగా గ్లామర్‌ బాంబ్‌ని దించుతున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్‌లో గ్లామర్‌ ట్రీట్‌తో బ్లాస్ట్ చేస్తున్న దిశా పటానీని ఐటెమ్‌ సాంగ్‌ కోసం ఎంపిక చేశారని తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈ బ్యూటీ పేరే వినిపించింది. ఆమెతోపాటు మరో హీరోయిన్‌ కూడా ఉంటుందని, కృతి సనన్‌ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఇప్పుడు దిశా పటానీనే ఎంచుకున్నట్టు తెలుస్తుంది. 

సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ట్రీట్‌తో పూనకాలు తెప్పిస్తుంది దిశా పటానీ. హాట్‌ బాంబ్‌లో పేలుతుంది. ఆమె బికినీ ట్రీట్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అలాంటిది బన్నీతో కలిసి స్టెప్పులేస్తూ థియేటర్లలో ఊగిపోవాల్సిందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ కూడా ఈ పాటకి నెక్ట్స్ లెవల్‌ మాస్‌ బీట్‌ని కంపోజ్‌ చేస్తున్నారట. రేపు థియేటర్లలో అదిరిపోతుందని అంటున్నారు. మరి ఇది ఏం రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. 

దిశా పటానీ తొలి సినిమా తెలుగులోనే చేసింది. పూరీ జగన్నాథ్‌ ఈ బ్యూటీని `లోఫర్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం చేశాడు. ఒక్క సినిమా చేసి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ బిజీ అయ్యింది. స్టార్‌ హీరోలతో జోడీ కట్టింది. కానీ సరైన బ్లాక్‌ బస్టర్‌ ఒక్కటి కూడా పడలేదు. మంచి బ్రేక్‌ కోసం చూస్తుంది. మరోవైపు చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్‌ `కల్కి2898ఏడీ`లో హీరోయిన్‌గా చేస్తుంది.

ఇక ప్రస్తుతం `పుష్ప2` షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల బన్నీ కాలుకి గాయమైనట్టు తెలిసింది. ఆయన రెండు రోజుల రెస్ట్ తో మళ్లీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఇక్కడి షూటింగ్‌ అనంతరం జపాన్‌లో ఉంటుందట. అది క్లైమాక్స్ షూట్‌ అని తెలుస్తుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15న మూవీని విడుదల చేయబోతున్నారు.

Read more: మహేష్‌ సినిమాకి టెక్నీషియన్ల లిస్ట్ ఇదే.. ఆ ఒక్కరి విషయంలో రాజమౌళి రిస్క్ చేస్తున్నాడా ?

Also Read: సినిమాలో రాశీఖన్నాకి చెప్పినట్టు నాకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.. వరుణ్‌ తేజ్‌తో లవ్‌ స్టోరీ బయటపెట్టిన లావణ్య
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios