MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాలో రాశీఖన్నాకి చెప్పినట్టు నాకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.. వరుణ్‌ తేజ్‌తో లవ్‌ స్టోరీ బయటపెట్టిన లావణ్య

సినిమాలో రాశీఖన్నాకి చెప్పినట్టు నాకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.. వరుణ్‌ తేజ్‌తో లవ్‌ స్టోరీ బయటపెట్టిన లావణ్య

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ కథ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నారు. సినిమా రేంజ్‌లో ఎక్స్ ప్రెస్‌ చేశాడని సీక్రెట్‌ బయటపెట్టింది లావణ్య.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 13 2024, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సినిమా సమయంలో ఏర్పడ్డ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. గతేడాది నవంబర్‌లో ఈ ఇద్దరు చాలా గ్రాండ్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. టాలీవుడ్‌ స్టార్స్ లో ప్రత్యేకంగా చెప్పుకునే మ్యారేజెస్‌లో వరుణ్‌-లావణ్యల పెళ్లి ప్రముఖంగా నిలుస్తుందని చెప్పొచ్చు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అయితే వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి అందరికి తెలిసిందే. `మిస్టర్‌` సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని ఇప్పటికే వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే లవ్‌ ప్రపోజ్‌ ఎలా జరిగింది? ఎప్పుడు జరిగిందనేది సస్పెన్స్. దీనికి సంబంధించిన ఓ క్రేజీ సీక్రెట్‌ని బయటపెట్టింది లావణ్య త్రిపాఠి. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ అసలు విషయం చెప్పేసింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 
 

37

శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన `మిస్టర్‌` చిత్రంలో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఇందులో హేబా పటేల్‌ మరో హీరోయిన్‌. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సినిమా షూటింగ్‌ అయిపోయే సరికి ప్రేమగా మారిందట. అయితే సినిమా ఎండింగ్‌లోనే తన లవ్‌ ప్రోజ్‌ చేశాడట వరుణ్‌ తేజ్‌. అది కూడా సినిమా స్టయిల్‌లో చెప్పాడట. ఆ సినిమా పేరేంటో కూడా బయటపెట్టింది లావణ్య. 
 

47

రాశీఖన్నాతో కలిసి `తొలిప్రేమ`లో నటించారు వరుణ్‌ తేజ్‌. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఇందులో కాలేజీలో రాశీఖన్నాకి లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు వరుణ్‌ తేజ్‌. అందరి ముందు ప్రపోజ్‌ చేస్తూ గులాబీ పువ్వు ఇస్తాడు. ఆయన ప్రపోజల్‌కి ఫిదా అయిన రాశీఖన్నా మరో ఆలోచన లేకుండా ఓకే చెబుతుంది. అందులో ఆ సీన్‌ బాగా పేలింది. తనకు లవ్‌ ప్రపోజ్‌ చేసే సమయంలోనూ సరిగ్గా అదే ఫాలో అయ్యాడట వరుణ్‌ తేజ. ఆ సినిమా స్టయిల్లోనే తనకు ప్రేమని వ్యక్తం చేశాడని, అప్పటికే వరుణ్‌ అంటే ఇష్టం ఏర్పడటంతో తను కూడా మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పిందట. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

57

మరి ఇంతకి `తొలిప్రేమ`లో వరుణ్‌ తేజ్‌ రాశీఖన్నాకి ఏం చెప్పాడనేది చూస్తే.. కలలా నా జీవితంలోకి వచ్చావు. కల కంటున్నప్పుడు వెళ్లిపోయావు. మళ్లీ ఇన్నాళ్లకి ఇలా మెరిశావు. ఇది కలా నిజమా అర్థం కావడం లేదు. నిజమైతే ఈ పువ్వు తీసుకో. కలైతే కనీసం ఈ సారైనా నన్ను నిద్ర లేపు` అని చెబుతాడు వరుణ్‌. దెబ్బకి నవ్వులు చిందిస్తూ ఆ రోజాపువ్వుని తీసుకుంటుంది రాశీఖన్నా. దీంతో కాలేజ్‌ స్టూడెంట్స్ అంతా క్లాప్స్ కొడతారు. ఆ లవ్‌ ప్రపోజల్‌ చాలా లైవ్లీగా, పోయెటిగ్‌గా ఉంది. ఆకట్టుకుంది. మొత్తానికి సినిమా డైలాగ్‌తోనే లావణ్యని పడేశాడన్నమాట వరుణ్‌ తేజ్‌. 

67

అయితే ఈ లవ్‌ ప్రపోజల్‌ ఇటలీలో జరిగిందట. అందుకే తనకు ప్రేమని వ్యక్తం చేసిన ఇటలీలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నవంబర్‌ 1న చాలా గ్రాండ్‌గా వీరి మ్యారేజ్‌ జరిగింది. మెగా ఫ్యామిలీ, బంధుమిత్రుల, ఒకరిద్దరు సినీ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 
 

77

ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ మార్చి 1న విడుదల కాబోతుంది. మరోవైపు లావణ్య త్రిపాఠి ఇటీవల `మిస్‌ పర్‌ఫెక్ట్` ఓటీటీ మూవీలో నటించింది. ఇది మంచి ఆదరణ పొందింది. వరుణ్‌ తేజ్‌కి చాలా కాలంగా హిట్‌ లేదు. ఇప్పుడు `ఆపరేషన్‌ వాలెంటైన్‌`పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Recommended image2
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Recommended image3
100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved