ఇటీవల కాలంలో మీ టూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఎంతటి చర్చ జరుగుతుందో చూస్తున్నాం. ఈ హ్యాష్ ట్యాగ్ కు నెటిజన్ల నుంచి, ముఖ్యంగా లేడీస్ నుంచి విశేష స్పందన వస్తోంది. దీనిపై హీరోయిన్లు కూడా విరివిగానే స్పందిస్తున్నారు. తాజాగా స్పందించిన ఓ హిరోయిన్ మాత్రం.. చాలా బోల్డ్ గా మాట్లాడేసింది.

 

సోషల్ మీడియాలో సంచలనంగా మారిన హ్యాష్‌ టాగ్‌ 'మీ టూ' పై మీ స్పందన అని అడిగిన ప్రశ్నకు హీరోయిన్ ఆండ్రియా దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. లైంగిక వేదింపులకు తాను వ్యతిరేకం అని, అమ్మాయిలని బలవంతంగా లైంగిక చర్యలకు లాగటం సరికాదంటూనే, అలాగే ఆమె వ్యక్తిగతంగా ఇష్టపడి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు మీరెందుకు ఆ విషయాన్ని మళ్ళీ, మళ్ళీ చూడాలని ప్రయత్నిస్తారు? అంటూ పంచ్ ఇచ్చింది.

 

ఈ తరహా మాటలు బాలీవుడ్ లో చల్తాహై అన్నట్లుంటుంది కానీ...  సౌత్ హీరోయిన్లకు ఇలా మాట్లాడే ధైర్యం తక్కువే. కానీ హిరోయిన్ ఆండ్రియా మాత్రం... ‘‘ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆ విషయంపై మరొకరు బలవంతం చేయకూడదు. చేయలేరు కూడా. నా సినీ కెరీర్‌లో నాకు లైంగికంగా ఇబ్బందులకు గురిచేసే సమస్యలు ఎక్కడా ఎదురు కాలేదు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకోవడానికి నేను సిద్ధం'' అని బోల్డ్ గా చెప్పేసింది.

 

ఇటీవల ముద్దు సీన్ల గురించి కూడా ఆమె ఇలానే షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్దార్థ్ సరసన ‘గృహం' సినిమాలో నటించిన ఆండ్రియా.. ఈ చిత్ర ట్రైలర్లో చూపించిన లిప్ లాక్స్ గురించి మీడియా వాళ్లు ప్రశ్నించినపుడు అదే రకం అసహనం తో తనదైన శైలిలో బదులిచ్చింది."లిప్ లాక్ సీన్స్ గురించి కేవలం మీడియానే ఇంకా విమర్శనాత్మక కోణంలో చూస్తోంది.

 

ఒకసారి రోడ్డు మీదికి వచ్చి చూడండి.. ఈ కాలం యువత ఇలాంటి వాటిని చాలా సహజంగా భావిస్తోంది. లిప్ లాక్ అశ్లీలం, అసభ్యం అనే వాళ్లందరూ నిజ జీవితంలో ముద్దులే పెట్టుకోవట్లేదా? లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని.. దాని గురించి మాట్లాడటం పాత పంచాంగం లాంటి విషయం'' అంటూ కోపాన్ని అనుచుకుంటున్న రీతిలో గట్టిగానే క్లాస్ తీసుకుంది ఈ యాంగ్రీ హాట్ హీరోయిన్. ప్రస్థుతం విశాల్ హీరోగా నటించిన ‘డిటెక్టివ్' చిత్రంలో నటించిన ఆమె సినిమా గురించి కూడా ముచ్చట్లు చెప్పింది.