టాలీవుడ్ హీరోయిన్ తో విశాల్ పెళ్లి..?

First Published 25, Jun 2018, 3:36 PM IST
Hero Vishal Marriage With Telugu Heroine Soon.?
Highlights

నిజమేనంటున్న కోలివుడ్ వర్గాలు

కోలివుడ్ హీరో విశాల్.. తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితమే. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ హీరో గురించి కోలీవుడ్ లో ఓ ఆసక్తి కర చర్చ జరుగుతోంది. అదే విశాల్ పెళ్లి వార్త. ఇప్పటికే 40 సంవత్సరాలు నిండిన విశాల్ ఇక ఈ విషయంలో ఎ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

అయితే గతంలో నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి తో ప్రేమాయణం సాగించాడు విశాల్, కానీ శరత్ కుమార్ తో విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. అప్పటి నుండి ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా.. ఎవర్ని పెళ్లి చేసుకుంటాడా అని కోలీవుడ్ జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు విశాల్ అంతగా గుర్తింపు లేని ఒక తెలుగు హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. 

ఇందులో పెద్దగా ఆశర్యపోవటానికి ఏం లేదు. ఎందుకంటే చెన్నైలో పుట్టిపెరిగినప్పటికీ, విశాల్ కుటుంబ సభ్యులు తెలుగువాళ్లు కావడం గమనార్హం. అయితే.. ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. 

loader