Asianet News TeluguAsianet News Telugu

యంగ్ హీరోయిన్ తో హీరో విక్రమ్ కొడుకు ప్రేమాయణం.. ఇంటర్నెట్ లో ఫోటోలు హల్చల్!

ఆన్ స్క్రీన్ ప్రేమికులు ఆఫ్ స్క్రీన్ లవ్ బర్డ్స్ గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ యంగ్ హీరోయిన్ ని డీప్ గా ప్రేమిస్తున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దుబాయ్ హోటల్ లో ఇద్దరూ కనిపించడంతో ఊగాహనాలు తెరపైకి వచ్చాయి. 

hero vikram son dhruv vikram celebrates new year along with heroin banita sandhu
Author
Hyderabad, First Published Jan 3, 2022, 2:14 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


ఆదిత్య వర్మ (Aditya Varma) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ విక్రమ్. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి అధికారిక రీమేక్ ఆదిత్య వర్మ. తమిళంలో ఆదిత్య వర్మ అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే హీరోయిన్ బనితా సంధు-ధృవ్ రొమాన్స్, కెమిస్ట్రీ బాగా పండాయి. కథ రీత్యా బోల్డ్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా ఇద్దరూ మమేకమై నటించారు. ఈ క్రమంలో మరి నిజంగానే ప్రేమ చిగురించేదేమో తెలియదు కానీ... వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న వాదన వినిపిస్తుంది. 

న్యూ ఇయర్ (New Year 2022) సెలెబ్రేషన్స్ కోసం ఆదిత్య వర్మ-బనితా సంధు దుబాయ్ వెళ్లారు.  అక్కడ ఓ లగ్జరీ హోటల్ లో స్టే చేశారు. సదరు హోటల్ బాల్కనీలో బనితా నిల్చున్న ఫోటోలు షేర్ చేసిన ధృవ్ (Dhruv Vikram).. న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే సమయంలో వీరి రొమాంటిక్ ట్రిప్ గురించి తెలుసుకొని జనాలు అవాక్కవుతున్నారు. ఇద్దరి మధ్య ఏమీ లేకుండా దుబాయ్ ఎందుకు వెళతారు? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఇద్దరు కెరీర్ లో ఇప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ధృవ్ తండ్రి విక్రమ్ తో కలిసి మహాన్ (Mahaan) అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ధృవ్ దాదా అనే పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న మహాన్ విడుదలకు సిద్దమవుతుంది. పరిశ్రమలో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది. 

మరోవైపు బనిత (Banita Sandhu)కూడా బాలీవుడ్‌ లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది. గతేడాది అక్టోబర్‌లో ‘హూవీ’ తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రిటిష్‌ బ్యూటీ.. ఆ తర్వాత విక్కీ కౌశల్‌ ‘సర్దార్ ఉద్దమ్‌’లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘కవిత అండ్‌ థెరిసా’ సినిమాలో నటిస్తోంది.

Also read Deepthi Sunaina: షణ్ముఖ్ తో బ్రేకప్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి... ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

కాగా విక్రమ్ సరైన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అపరిచితుడు మూవీతో తెలుగులో భారీ మార్కెట్ క్రియేట్ చేసుకున్న విక్రమ్ నుండి ఆ స్థాయి చిత్రం మరలా రాలేదు. తెలుగులో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉండగా.. విక్రమ్ కమ్ బ్యాక్ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

Also read Nayanthara: పెళ్లి కాలేదు కాని .. ఫుల్లుగా తిరిగేస్తున్నారు. పెళ్ళెప్పుడంటే మాత్రం..?

Follow Us:
Download App:
  • android
  • ios