స్టార్ హీరో బైక్ పై రహస్యంగా వెళ్లి మరీ కలిశాడు!

స్టార్ హీరో బైక్ పై రహస్యంగా వెళ్లి మరీ కలిశాడు!

స్టార్ హీరోలు చేసే పనులపై అందరి ఫోకస్ ఉంటుంది. ఏ భాష హీరో అయినా ఆరాలు తీయడం మాత్రం మానరు. ఇక తమిళనాడులో హీరోలపై దృష్టి మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సినిమా ఇండస్ట్రీ రాజకీయాలతో పెనవేసుకొని ఉంటుంది. ఇప్పటికే రజినీకాంత్, కమల్ హాసన్ వంటి తారలు రాజకీయాల్లో బిజీ కానున్నారు. ఇక మరింకొందరు హీరోలు రాజకీయాల పట్ల తమ ఉద్దేశాలను చెబుతూనే ఉంటారు.

ఇలయదళపతి విజయ్ తీరు చూస్తుంటే ఇప్పుడు ఆయన కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆయన పాలిటిక్స్ లోకి వస్తారో లేదో తెలియదు కానీ ప్రజలకు దగ్గరగా మాత్రం ఉంటున్నాడు. అన్యాయంగా ఎవరైనా చనిపోతే ఎవరికీ  తెలియకుండా వారిని రహస్యంగా వెళ్లి కలిసి సహాయం చేస్తుంటాడు. తాజాగా స్టెరిలైజ్ షూట్ అవుట్లో మరణించిన ఒక వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించాలని అనుకున్నాడు.

తూత్తుకూడిలో ఉన్న ఆ వ్యక్తి కుటుంబాన్ని కలవడం కోసం బైక్ పై ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్లి మరీ కలుసుకున్నాడు. వారికి లక్ష రూపాయల నగదు సహాయం చేశాడు. గతంలో కూడా విజయ్ ఇలా కొందరికి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ హీరో కూడా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page