Asianet News TeluguAsianet News Telugu

హమీద టాపిక్‌ తీసిన షణ్ముఖ్‌.. మండిపోయిన సిరి.. సారీ చెప్పమంటే గట్టిగా హగ్‌..

నాల్గో రౌండ్‌ కెప్టెన్సీ పోటీ దారుల కోసం జెస్సీ తన అనారోగ్యం కారణంగా స్వతహాగా వైదొలిగాడు. జెస్సీ విషయంలో షణ్ముఖ్‌, సిరిల మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. జెస్సీ కోసం తాము నిలబడితే, అతనేమో దాన్ని వాడుకోవడం లేదని, తమని వెదవలని చేస్తున్నాడని షణ్ముఖ్.. సిరి వద్ద అసహనం వ్యక్తం చేశాడు.

Bigg  Boss Telugu 5 shanmukh and siri strong hug highlight of 53rd episode
Author
Hyderabad, First Published Oct 27, 2021, 11:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌ బాస్‌5(Bigg Boss Telugu 5)..హౌజ్‌లో 52వ రోజు(53వ ఎపిసోడ్‌) కెప్టెన్సీ టాస్క్ తోనే నడిచింది. అభయహస్తం టాస్క్ లో భాగంగా ఐదు దశలుగా కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెండర్లని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పటికే షణ్ముఖ్‌(Shanmukh), సిరి(Siri), శ్రీరామ్‌(Sriram) గెలిచారు. హౌజ్‌లోకి వెళ్లేందుకు అనుమతి పొందారు. మిగిలిన వారు రాత్రి మొత్తం బయటే ఉన్నారు. బయటే పడుకున్నారు. అందులో కెప్టెన్‌ సన్నీ సైతం బయటే పడుకోవడంతో నిద్ర పట్టలేదని, మార్నింగ్‌ మానస్‌తో బాడీ మసాజ్‌ చేయించుకున్నాడు. 

ఆ తర్వాత నాల్గో రౌండ్‌ కెప్టెన్సీ పోటీ దారుల కోసం జెస్సీ తన అనారోగ్యం కారణంగా స్వతహాగా వైదొలిగాడు. జెస్సీ విషయంలో షణ్ముఖ్‌, సిరిల మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. జెస్సీ కోసం తాము నిలబడితే, అతనేమో దాన్ని వాడుకోవడం లేదని, తమని వెదవలని చేస్తున్నాడని షణ్ముఖ్.. సిరి వద్ద అసహనం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని జెస్సీతో చర్చించారు.  ఇక నాల్గో రౌండ్‌లో అనీ మాస్టర్‌, ప్రియాంక పోటీ పడ్డారు. ఇందులో భాగంగా వైట్‌ బోర్డ్ పై వీరిద్దరు తమకి కేటాయించిన రంగులను పెయింటింగ్‌గా వేయాల్సి ఉంటుంది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో అనీ మాస్టర్‌ విజయం సాధించారు. హౌజ్‌లోకి వెళ్లే అవకాశం పొందారు. కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచారు.

ఇది పూర్తయిన తర్వాత బెడ్స్ పై పడుకున్న సిరి.. షణ్ముఖ్‌తో మనం తర్వాత ఓ వీడియో చేద్దాం రా అంటుంది. అందుకు షణ్ముఖ్‌.. అప్పుడు హమీద, ఇప్పుడు నువ్వు నన్ను వీడియోలు చేసేందుకు మాత్రమే వాడుకుంటున్నారని అనడంతో సిరికి మండింది. ఆమె అటువైపు తిరిగి అలిగింది. దీన్ని గమనించిన షణ్ముఖ్‌.. అలిగావా అంటూ వారించాడు. తనకు ఆ అవసరం లేదంటూ సిరి సైతం బుంగమూతి పెట్టింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కిచెన్‌లో సరదా సన్నివేశాలు జరిగాయి. చివరికి తనకు సారీ చెప్పాలంటుంది సిరి.. అందుకు షణ్ముఖ్‌.. ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. తాను సారీ ఇలానే చెబుతానని చెప్పాడు. 

అయినా వదల్లేదు సిరి. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి టిట్‌ ఫర్‌ టాట్‌లాగా జరిగింది. ఫైనల్‌గా సిరికి సారీ చెప్పాడు షణ్ముఖ్‌. రెండు సార్లు సారీ చెప్పడంతో కరిగిపోయిన సిరి.. షణ్ముఖ్‌ని గట్టిగా వాటేసుకుంది. దీంతో ఈ రోజు ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలిచింది. ఇక చివరగా ఉన్న ఐదో రౌండ్‌లో సన్నీ, కాజల్‌ పోటీపడ్డారు. కారులో హుషారుగా టాస్క్ లో ఎక్కువ బొకేలు తెచ్చి సన్నీ విన్నర్‌ అయ్యారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లే అనుమతితోపాటు కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచారు.

ఈ టాస్క్ అనంతరం.. రవి.. సిరి, షణ్ముఖ్‌లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు. వారితో గేమ్‌ గురించి వారించాడు. అయితే రవిపై మానస్‌, జెస్సీ, కాజల్‌ ముచ్చటించారు. రవి చేసేది ప్రతిదీ ఓ గేమ్‌ అని అన్నారు. అంతకు ముందు రవి కేవలం గేమ్‌  మాత్రమే ఆడతాడని, లోబో ఫ్రెండ్‌గా చూడడని, ఈ వారం ఒకరు ఎలిమినేటెడ్‌ అనేదే ఆలోచిస్తారని అనుకోవడం ఇంట్రెస్టింగ్‌ని క్రియేట్‌ చేసింది. అయితే వీళ్లు మాట్లాడుకునేది వినేందుకు మధ్యలో రవి వారి వైపుగా రావడంతో టాపిక్‌ డైవర్ట్ చేశారు. 

also read: ప్రభాస్‌తో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనంటోన్న `రొమాంటిక్‌` బ్యూటీ.. అసలైన అందాలతో అదరహో అనిపిస్తుందిగా..

చివరగా కెప్టెన్సీ పోటీలో లేని వారికి చివరి అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో రింగ్‌లో బాల్‌ని ఎవరైతే ముందుగా పట్టుకుంటారో వారు.. ఇతర కంటెస్టెంట్లకి కేటాయించిన బుట్టలో వేసి వారిని ఎలిమినేట్‌ చేయాల్సి ఉంటుంది. మానస్‌ ఇందులో దూకుడు ప్రదర్శించాడు. ఆయన వరుసగా ఐదు సార్లు బాల్‌ పట్టుకుని విశ్వని, రవిని, జెస్సీని, లోబోని, కాజల్‌, చివరగా ప్రియాంకని ఎలిమినేట్‌ చేసి తాను విన్నర్‌గా నిలిచాడు. కెప్టెన్సీ పోటీలో నిలిచాడు. దీంతో అభయ హస్తం అనే టాస్క్ పూర్తి కావడంతో సభ్యులంతా ఇంట్లోకి వెళ్లారు. 

also read: హాట్‌ షోతో విజువల్‌ ఫీస్ట్ నిచ్చిన మెహరీన్‌.. ఎట్టకేలకు మంచిరోజులొచ్చాయట..

Follow Us:
Download App:
  • android
  • ios