Asianet News TeluguAsianet News Telugu

Allu Arjun:థియేటర్ కి వచ్చే అలవాటు జనాల్లో తగ్గింది, 60ఏళ్లలో చూడని దుర్భర పరిస్థితి... బన్నీ కామెంట్స్

వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవడంతో, ఈ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. Varudu kavalenu ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన Allu arjun కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

hero allu arjun made interesting comments on film industry situations
Author
Hyderabad, First Published Oct 28, 2021, 8:06 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నిన్న హైదరాబాద్ వేదికగా వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవడంతో, ఈ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. Varudu kavalenu ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన Allu arjun కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గత 40-60 ఏళ్లలో చిత్ర పరిశ్రమ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూసి ఉండదు. కోవిడ్ వలన జనాలకు థియేటర్ కి వచ్చి సినిమా చూసే అలవాటు తగ్గింది. టికెట్ రేట్స్, యాభై శాతం ఆక్యుపెన్సీ వంటి సమస్యలు కూడా కారణం. ఆ ఇబ్బందులన్నీ తొలిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే గతంలో మాదిరి థియేటర్స్ కి వస్తున్నారు. 


వరుడు కావలెను సినిమాతో పాటు రొమాంటిక్ మూవీ విడుదల అవుతుంది. ఆ సినిమా కూడా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే తమిళనాడులో వంద శాతం ఆక్యుపెన్సీ తరువాత Rajinikanth గారి అన్నాత్తే విడుదల అవుతుంది. ఆ సినిమా భారీ విజయం అందుకోవాలి. కేరళలో ఇంకా థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. కర్ణాటకలో ఓపెన్ అయ్యాయని తెలుస్తుంది. కన్నడలో భజరంగీ మూవీ విడుదలవుతుంది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే హిందీలో సూర్యవంశీ మూవీ విడుదల అవుతుంది. ఆ సినిమా సక్సెస్ సాధించాలి. ఇండియన్ సినిమా మొత్తం బాగుండాలి. ఈ దీపావళి పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని కోరుకుంటున్నా... అంటూ అల్లు అర్జున్ పరిశ్రమ పట్ల తన ప్రేమ చాటుకున్నారు. 

Also read `రొమాంటిక్‌` గ్రాండ్‌ ప్రీమియర్స్ రెడ్‌ కార్పెట్‌లో రాజమౌళి, సత్యదేవ్‌, పూరీ, వంశీపైడిపల్లి, మోహన్‌రాజా సందడి
అనంతరం పుష్ప మూవీ గురించి అల్లు అర్జున్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప అద్భుతంగా ఉంటుందని అప్పుడే నేను చెప్పను. అయితే పాటలు బాగా వచ్చాయి, అది మాత్రం చెప్పగలను. విడుదలైన పాటలతో పాటు రాబోయే పాటలు కూడా చాలా బాగుంటాయి. Pushpa డిసెంబర్ లో వస్తుందంటూ... అల్లు అర్జున్ రిలీజ్ డేట్ గుర్తు చేశారు. 

Also read రజనీకాంత్‌ `పెద్దన్న` హై వోల్టేజ్‌ ట్రైలర్‌ .. ఫ్యాన్స్ కి పూనకాలే..
ఇక నాగ శౌర్య సినిమాలు దాదాపు అన్నీ నేను చూశాను, అతనిలో తెలియని ఇన్నోసెంట్ ఉంటుంది. అది నాకు ఇష్టం. అలాగే పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగాడు, అది గొప్ప విషయం. ఇక రీతూ మొదటి సినిమా చూసి, ఎవరు ఈ అమ్మాయి చాలా బాగా చేసిందని అడిగాను. హైదరాబాద్ అమ్మాయి అని తెలుసుకొని కొంచెం గౌరవంగా ఫీల్ అయ్యాను. రీతూ వర్మలోని డిగ్నిటీ నాకు బాగా నచ్చుతుంది.. అంటూ బన్నీ వరుడు కావలెను హీరో హీరోయిన్ పై ప్రసంశలు కురిపించారు. వరుడు కావలెను టీమ్ సభ్యులను అభినందించిన అల్లు అర్జున్, వారికి బెస్ట్ విషెష్ తెలియజేశారు. ఈ సినిమాలోని దిగు దిగు నాగ సాంగ్ తన కూతురు అల్లు అర్హకు ఎంతో ఇష్టమని చెప్పారు బన్నీ. 

Follow Us:
Download App:
  • android
  • ios