పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తనపై కోపం వుందన్న రాజశేఖర్ లేటెస్ట్ మూవీ గరుడవేగ ప్రమోషన్ లో భాగంగా రాజశేఖర్ ఇంటర్వ్యూ తన మీద కోపం వల్లే గబ్బర్ సింగ్ సినిమాలో కావాలనే కించ పరిచారన్న యాంగ్రీ మ్యాన్ 

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, తెలుగువాడు కాకపోయినా తెలుగింటి అల్లుడుగా తనకంటూ ప్రత్యేక గుర్చింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. తన ఆవేశ పూరిత డైలాగులతో, నటనతో అంకుశం, వందేమాతరం లాంటి సినిమాలతో... యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. రీసెంట్ గా గరుడవేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజశేఖర్ ఆ మూవీ ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కు తన పై కోపం వుందంటూ, తొక్కేయాలని చూశారంటూ బాంబ్ పేల్చారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నేనంటే చాలా కోపం.. అందుకే ఆయన తన సినిమాల్లో నన్ను టార్గెట్ చేస్తూ సీన్లు చేశారని హీరో రాజశేఖర్ అన్నారు. 'గబ్బర్ సింగ్' సినిమాలో తనను ఇమిటేట్ చేస్తూ చేసిన సీన్ల గురించి యాంకర్ అడిగిన ప్రశ్నలకు స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమాలో మీ మీద ఎందుకు అలాంటి సీన్లు చేశారు? అనే దానికి రాజశేఖర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "ఆయనకు నాపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నారు. అంతే... అందులో అన్నీ ఓకే, కానీ లాస్టులో తిట్టుంటారు. అలా డ్యాన్స్ చేపిస్తారు. డ్యాన్స్ చేపించిన తరువాత ఏం చేస్తిరి... ఏం చేస్తిరి.. ఏంటి అని ఆలీ ఏదో వచ్చి మాట్లాడినట్టు చూపిస్తారు. ఆయన కోపాన్ని... ఏంట్రా... చూస్కో అన్నట్టు, నాకు వార్నింగ్ ఇచ్చినట్టు, నన్ను తిట్టినట్టు...చూపించారు, అది నాకు బాధ కలిగించింది'' అని రాజశేఖర్ అన్నారు.

పవన్ కళ్యాణ్‌కు మీ మీద ఎందుకు అంత కోపం అనే ప్రశ్నకు రాజశేఖర్ స్పందిస్తూ... ‘ ప్రజారాజ్యం పార్టీ... అందులో కొన్ని విషయాలు. ఆయన గురించి ఓ టీవీ ఇంటర్వ్యూలో జరిగిన విషయం చెప్పాను. అదే ఆయనకు నాపై కోపం అనుకుంటాను" అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

ఇండస్ట్రీకి వచ్చిన 30 సంవత్సరాలయినా ఎందుకు తెలుగు ప్లూయెంటుగా మాట్లాడలేక పోతున్నారు అనే ప్రశ్నకు రాజశేఖర్ స్పందిస్తూ.... నాకు నత్తి ఉంది, ఈ విషయం సిగ్గు లేకుండా చెబుతాను. అందుకే మాట్లాడే సమయంలో కాస్త తడబడతాను. నత్తి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. అందుకే మూడు నాలుగు మాటలు ఆలోచించి ఏది నాకు సరిగా పలకడానికి వీలుంటుందో అదే చెబుతాను. అయితే ఇది కొందరికి నాకు తెలుగు సరిగా మాట్లాడటం రాదు అనే భావన కలిగిస్తుంది అని రాజశేఖర్ అన్నారు.

నేను రాజు నేనే మంత్రి సినిమా నేనే చేయాల్సిందే. స్క్రిప్టు నాకు బాగా నచ్చింది. అయితే క్లైమాక్స్ విషయంలో దర్శకుడు తేజ, నాకు మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. అలా ఉంటే నేను చేయను అని పక్కకు తప్పుకున్నాను, దీంతో ఆ సినిమా రానా చేశారని రాజశేఖర్ తెలిపారు.

ఇండస్ట్రీలో మిమ్మల్ని తొక్కేసారని మీ అభిమానులు అంటున్నారు. ఎందుకు ఇలాంటి వాదన తెరపైకి వచ్చింది అనే విషయం గురించి రాజశేఖర్ స్పందిస్తూ.. కొంత మంది నేను ఎదిగితే వారికి కాంపిటీషన్ అవుతాను అని నన్ను తొక్కేసారని అనుకోవచ్చు. అలా జరిగింది కూడా. ఎంతో మంది హీరోయిన్లను నాతో యాక్ట్ చేయవద్దని కొందరు అడ్వైజ్ చేసిన వాళ్లు ఉన్నారు. ఎంతో మంది డైరెక్టర్లను నాతో చేయవద్దని అడిగిన వారు ఉన్నారు. దాని వల్ల ఒకరిని ఒకను తొక్కేయలేరు. వారి టాలెంటును ఎవరూ మూసేయలేరని రాజశేఖర్ అన్నారు.

నా కూతురు శివాని కూడా నామాదిరిగానే ఆలోచిస్తుంది. మంచి విషయం ఉన్న సబ్జెక్టు చేయాలనుకుంటోంది. అందుకే సినిమా కాస్త లేటవుతుంది. ఇప్పటికే మూడు నాలుగు సబ్జెక్టులు ఒకే చేశారు. అయితే ఏది ముందు వస్తుంది, ఏది తర్వాత వస్తుంది అనేది తెలియదు. రెండు మూడు నెలల్లో శివాని తొలి సినిమా ప్రారంభం అవుతుంది అని రాజశేఖర్ అన్నారు.

ఇటీవల రాజశేఖర్ మదర్ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె గురించి తలుచుకుంటూ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను ఆసుపత్రికి తరలించే ముందు ఐదారు నిమిషాలు వేస్ట్ చేశాననే బాధ తనను తీవ్రంగా వేధిస్తోందని, ఆ సమయం వేస్ట్ చేసి ఉండక పోతే అమ్మ ఇంకో సంవత్సరం బ్రతికి ఉండేదేమో అని రాజశేఖర్ కన్నీరు పెట్టుకున్నారు

షూటింగులకు చాలా లేటుగా వస్తారు అనే ఆరోపణలపై రాజశేఖఱ్ స్పందిస్తూ... నేను షూటింగులకు లేటుగా వస్తాను. నిజమే. ఆ విషయం నేను ముందే చెబుతాను. ఈ రోజు షూటింగుకు వచ్చిన తర్వాత ఎంత సేపైనా పెట్టుకోండి. అయితే నేను షూటింగ్ నుండి వెళ్లిన తర్వాత మళ్లీ 12 గంటల తర్వాత పెట్టుకోండి. ఎందుకంటే 8 గంటల నిద్రపోవాలి, నిద్రకు 2 గంటల ముందు, లేచిన తర్వాత రెడీ కావడానికి రెండు గంటల సమయం పడుతుంది. అలా షూటింగ్ పెట్టుకోమని చెబుతాను అని రాజశేఖర్ అన్నారు.

తన భార్య జీవిత నాకు దేవుడు ఇచ్చిన వరం అని, సహనం, ఓర్పు తన భార్యకు ఉన్న సద్గుణాలని, అవే తనను ఎన్నోమార్లు కాపాడాయని రాజశేఖర్ అన్నారు.