Asianet News TeluguAsianet News Telugu

బిజినెస్ లోకి అడుగుపెట్టిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. భారీ ప్లాన్

  • బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్ అయిన ప్ర‌భాస్ 
  • తెలుగు సినిమాల్లో త‌న స‌త్తా చూపించిన రెబ‌ల్ స్టార్
  • తాజాగా స‌రికొత్త బిజినెస్ ప్రారంభించ‌బొతున్నాడు
hero prabhas start business in ap

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమా రెండు పార్టులు చేయడానికి చాలా సమయం వెచ్చించినా  అందకు తగిన ప్రతిపలం ఇటు స్టార్‌డమ్ పరంగానూ, అటు రెమ్యూనరేషన్ పరంగానూ పొందాడు. అప్పటి వరకు తెలుగుకే పరిమితం అయిన ప్రభాస్ ఇపుడు నేషనల్ స్టార్ అయ్యాడు.బాహుబలి ద్వారా వచ్చిన డబ్బును ప్రభాస్ బిజినెస్ ప్లాన్స్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ప్రభాస్‌కు బాగా తెలిసింది సినిమా, ఎంటర్టెన్మెంట్ రంగమే. ఈ దిశగానే ఆయన బిజినెస్ ఆలోచనలు సాగుతున్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏడున్నర ఎకరాల స్థలంలో మూడు థియేటర్ల మల్టీ కాంప్లెక్స్, అదే ఆవరణలో రెస్టారెంట్లు, చిన్న పిల్లలు ఆడుకునేలా థీమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

 

తను ఏం చేసినా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే ప్రభాస్. దేశంలో మరెక్కడా లేని విధంగా తొలిసారి 106 అడుగుల భారీ త్రీడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇది హైదరాబాద్‌లోని ఐమాక్స్ స్క్కీన్ కంటే పెద్దగా. 670 మంది ఒకేసారి కూర్చుని చూసేలా ఏర్పాట్లు ఉంటాయట
దీని కోసం ప్రభాస్ భారీ పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం.

 

ఈ ఎంటర్టెన్మెంట్ హబ్ నిర్మాణం కోసం రూ. 40 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడని, అంతకంటే కాస్త ఎక్కువైనా భరించడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది .2018లో మార్చిలోగా ఈ ఎంటర్టన్మెంట్ హబ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదే స్థలంలో భారీ కళ్యాణ మండపం ఒకటి ప్లాన్ చేస్తున్నారని, ఇది పెళ్లి వేడుకలు, ఇతర వేడుకలకు ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ బిజినెస్ ప్లాన్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios