Asianet News TeluguAsianet News Telugu

వాళ్లకు వాళ్లే బిరుదులు, పొగడ్తల కోసం డబ్బులు.. మళ్ళీ రెచ్చిపోయిన హీరో సిద్దార్థ్


ఈ మధ్య హీరో సిద్ధార్థ్ (Siddartha) తీరు కొందరి మనోభావాలను దెబ్బతీస్తుంది. ఆయన వ్యక్తిగత విషయాలపై కూడా పబ్లిక్ కామెంట్స్ చేస్తూ... వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సిద్దార్థ్ పుష్ప మూవీని కార్నర్ చేస్తూ ట్వీట్స్ వేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమౌతుంది. 
 

hero once again made controversial tweet is this on allu arjun again
Author
Hyderabad, First Published Dec 24, 2021, 1:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఒకప్పుడు సిద్ధార్థ్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలు టాలీవుడ్ రికార్డ్స్ కొల్లగొట్టాయి. ఇక బొమ్మరిల్లు మూవీ అయితే ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోయింది. తర్వాత వరస పరాజయాల కారణంగా సిద్ధార్థ్ తెలుగులో మార్కెట్ కోల్పోయారు. ఇటీవల ఆయన మహా సముద్రం మూవీతో కమ్ బ్యాక్ కావాలని ప్రయత్నించారు. అయితే ఆ మూవీ అట్టర్ ప్లాప్  కావడంతో ఆశలు గల్లంతయ్యాయి. 


కాగా సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. కాంటెంపరరీ సోషల్, పొలిటికల్ ఇష్యూస్ పై ఆయన స్పందిస్తూ, తన అభిప్రాయం నెటిజెన్స్ తో పంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో కొన్నిసార్లు ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అక్టోబర్ 2న సమంత (Samantha) చైతూతో విడిపోతున్నట్లు విడాకుల ప్రకటన చేశారు. ఈ ప్రకటనను ఉద్దేశిస్తూ... సమంతపై ఘాటు కామెంట్ చేశాడు. మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరని స్కూల్ లో మా టీచరు చెప్పారంటూ... ట్వీట్ చేశారు. కెరీర్ బిగినింగ్ లో సమంత హీరో సిద్ధార్థ్ తో డేటింగ్ చేశారన్న రూమర్లు ఉన్నాయి. దీంతో సిద్ధార్థ్ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. 

ఇక కొద్ది రోజులుగా ఆయన అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప మూవీని ఉద్దేశిస్తూ సెటైర్లు వేస్తున్నాడు. ట్వీట్స్ తో వరుస విమర్శలకు దిగుతున్నారు. పుష్ప అసలు పాన్ ఇండియా చిత్రం కాదు. అలాగే పుష్ప వసూళ్ల లెక్కలు అన్నీ ఫేక్ అంటూ పరోక్షంగా ట్వీట్స్ వేశారు. పుష్ప (Pushpa)కలెక్షన్ రిపోర్ట్స్ ట్వీట్ చేస్తున్న ఓ మూవీ ట్రాకర్ కి సిద్ధార్థ్ ట్విట్టర్ లో సమాధానం  చెప్పే ప్రయత్నం చేశారు. సిద్ధార్థ్ తీరుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతడిపై దాడికి దిగుతున్నారు. 

అయినప్పటికీ ఆయన అసలు తగ్గడం లేదు. తాజాగా మరో ఘాటైన ట్వీట్ తో సిద్ధార్థ్ కొందరిని టార్గెట్ చేశారు. ''మన దేశంలో కొంతమంది తమకు తామే బిరుదులు ఇచ్చుకుంటారు. తమని తాము దేవుని ప్రతిరూపాలుగా భావిస్తారు. స్తుతించడానికి జనాలకు డబ్బులు చెల్లిస్తారు.  బ్రతికున్నంత కాలం మనం వాళ్ళ చెడు గురించి మాట్లాడలేం. అలా చేస్తే మనం చచ్చిపోతాం.  చనిపోయాక వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. చనిపోయాక వాళ్ళ తప్పుల గురించి ఎవరూ మాట్లాడరు. నిజానికి విలువలు మిమ్మల్ని దేవుడుగా మార్చుతాయి'' అని కామెంట్ చేశారు. 

Also read పాన్‌ ఇండియా సినిమాలు, కలెక్షన్లపై హీరో సిద్ధార్థ్‌ షాకింగ్‌ ట్వీట్‌.. టార్గెట్‌ ఆ సినిమానేనా?

సిద్ధార్థ్ లేటెస్ట్ ట్వీట్ సైతం అల్లు అర్జున్ ని ఉద్దేశించేనని కొందరు భావిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు తమకు గిట్టని వాళ్లకు అన్వయించుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవం ఏదైనా కొన్ని విషయాలపై స్పందించకుండా ఉంటేనే బెటర్. ఎవరైనా డబ్బులు ఖర్చుపెట్టి తమని తాము గొప్పవాళ్లుగా చిత్రీకరించుకోవడం వలన వచ్చిన నష్టం ఏమీ లేదు . అది గ్రౌండ్ రియాలిటీని మార్చలేదు. ఇమేజ్ అయినా, మూవీ వసూళ్లు అయినా ప్రచారం చేసినంత మాత్రాన మారవు. 

Follow Us:
Download App:
  • android
  • ios