AP ticket prices:థియేటర్ కలెక్షన్స్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ బెటర్.. ఏపీ ప్రభుత్వంపై నాని సెటైర్స్
శ్యామ్ సింగ రాయ్ (Shyam singha roy) మూవీ రేపు విడుదలవుతుండగా హీరో నాని ఏపీలో అమలవుతున్న సినిమా టికెట్స్ ధరలపై తీవ్ర అసహనం తెలియజేశారు. ప్రస్తుతం ఏపీలో సినిమా హాళ్ల కలెక్షన్స్ కంటే కిరాణా షాప్ వసూళ్లు అధికంగా ఉన్నాయని సెటైర్లు వేశారు.
శ్యామ్ సింగ రాయ్ (Shyam singha roy) మూవీ రేపు విడుదలవుతుండగా హీరో నాని ఏపీలో అమలవుతున్న సినిమా టికెట్స్ ధరలపై తీవ్ర అసహనం తెలియజేశారు. ప్రస్తుతం ఏపీలో సినిమా హాళ్ల కలెక్షన్స్ కంటే కిరాణా షాప్ వసూళ్లు అధికంగా ఉన్నాయని సెటైర్లు వేశారు.
ఏపీలో సినిమా టికెట్స్ AP Ticket prices) వివాదం కొనసాగుతుంది. ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం లో చాలా మార్పులు చేయడం జరిగింది. బెనిఫిట్ షోల రద్దు, ఆన్లైన్ ద్వారా టికెట్స్ అమ్మకాలు, ధరల తగ్గింపు వంటి కీలక మార్పులు పొందుపరిచారు. ప్రాంతం, థియేటర్ స్థాయి ఆధారంగా రేట్లు నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో టికెట్ కనిష్ట ధర రూ. 5 గా నిర్ణయించారు. సినిమా టికెట్స్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ని హైకోర్టు రద్దు చేసింది. పాత ధరలకే సినిమా టికెట్స్ అమ్మాలని ఆదేశించింది.
అయితే తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ కి వెళ్లడం జరిగింది. ఈ విచారణ జనవరి 4కి వాయిదా వేయడంతో కొత్త జీవోలో పొందుపరిచిన ధరలకే ఏపీలో టికెట్స్ అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని మీడియా ముఖంగా ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తారు. అంత తక్కువ ధరకు సినిమా టికెట్స్ అమ్మడం ప్రేక్షకులను అవమానించడమే అన్నారు.
టికెట్స్ ధరలు పెంచినా భరించగల స్తొమత ప్రేక్షకులకు ఉంది. ప్రస్తుతం ఏపీలో థియేటర్స్ వసూళ్ల కంటే కిరాణా కొట్టు వసూళ్లు అధికంగా ఉన్నాయని సెటైర్ వేశారు. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా వివాదాస్పదం అవుతుంది. సినిమా టికెట్స్ ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రస్తుత ధరలతో సినిమా మనుగడ కష్టమన్న అభిప్రాయం వెల్లడించారు.
నాని లేటెస్ట్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ మూవీ విడుదల అవుతుండగా.. ఏపీలో కఠిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రమాణాలు పాటించని అనేక థియేటర్స్ ని అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలలో పదుల సంఖ్యలో థియేటర్స్ ని అధికారులు సీజ్ చేశారు.
Also read Shyam Singha roy: బాలయ్యని వెనకేసుకొచ్చిన నాని.. కమల్ సినిమాకి సంబంధం లేదట!
అధికారుల దాడులకు బయపడి కొందరు థియేటర్స్ యజమానులు స్వచ్చందంగా మూసివేస్తున్నారు. ఒక్కసారి థియేటర్ సీజ్ చేస్తే... దానిని తిరిగి తెరిపించడానికి సవా లక్ష ఫార్మాలిటీస్ ఉంటాయి. వీటన్నింటికి భయపడిన థియేటర్స్ యజమానులు తెరిచే సాహసం చేయడం లేదు. మరోవైపు నేడు విజయవాడలో జరగాల్సిన ఎగ్జిబిటర్స్ సమావేశం వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితులలో రేపు విడుదల కానున్న శ్యామ్ సింగరాయ్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే నాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read నాని సినిమాపై సాయిపల్లవి హాట్ కామెంట్.. అలాంటి పాత్రలు చేయలేనంటూ స్టేట్‌మెంట్