Shyam Singha roy: బాలయ్యని వెనకేసుకొచ్చిన నాని.. కమల్ సినిమాకి సంబంధం లేదట!
బలమైన కథ ఉన్నప్పుడే పీరియడ్ చిత్రాలు చేయాలని, అలాంటి అద్బుతమైన కథ `శ్యామ్ సింగ రాయ్`లో ఉంటుందని చెప్పారు హీరో నాని. ఈ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయని, సినిమా పూర్తయిన తర్వాత చూసుకుంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు.
నేచురల్ స్టార్ నాని.. బాలకృష్ణపై స్పందించారు. ఇటీవల ఆయన `అన్‌స్టాపబుల్‌విత్ఎన్బీకే` షోలో పాల్గొని సందడి చేసిన విషయంతెలిసిందే. తాజాగా బాలయ్యపై నాని రియాక్ట్ అయ్యారు. ఆయన గురించి బయట మాట్లాడుకునేవి అన్నీనిజం కాదని, ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం అని, ఆయన మనసులో ఏదీ ఉండదని తెలిపారు. నాని.. ప్రస్తుతం నటించిన `శ్యామ్‌సింగరాయ్` చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నాని బుధవారం మీడియాతో ముచ్చటించారు.
బలమైన కథ ఉన్నప్పుడే పీరియడ్ చిత్రాలు చేయాలని, అలాంటి అద్బుతమైన కథ `శ్యామ్ సింగ రాయ్`లో ఉంటుందని చెప్పారు హీరో నాని. ఈ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయని, సినిమా పూర్తయిన తర్వాత చూసుకుంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. కమల్ హాసన్ నటించిన `నాయకుడు`కి, ఈ చిత్రానికి సంబంధం లేదని చెప్పారు. `కమల్ గారి అభిమానిని అవ్వడంతో ఎక్కడో చోట ఆయన ప్రభావం ఉంటుంది. కానీ కథ పరంగా ఎక్కడా పోలిక ఉండదు. `శ్యామ్ సింగ రాయ్`లో నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కచ్చితంగా గూస్ బంప్స్ మూమెంట్స్ అవుతాయి. వాటిని ఈ కథలో మలిచిన తీరు అద్భుతంగా ఉంటాయి` అని చెప్పారు నాని.
`జెర్సీ` డైరెక్టర్ గౌతమ్‌లోని క్వాలిటీస్..`శ్యామ్ సింగ రాయ్` దర్శకుడు రాహుల్‌లో చూశాను. చిన్న చిన్న వాటికి చాలా ఎగ్జైట్ అవుతారు. ఆ వయసులో ఆ మెచ్యూరిటీ అరుదుగా ఉంటుంది. రాహుల్‌లో ఎంతో క్లారిటీ ఉంటుంది. ప్రతీది డీటైల్డ్‌గా చెప్పి మరీ చేయించుకుంటారు. తనకు లిటరేచర్ మీద బాగా గ్రిప్ ఉంది. అలాంటి వ్యక్తి పీరియడ్ సినిమా తీస్తే ఇంకెంత డీటైల్‌గా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. రెండేళ్ల తర్వాత నాసినిమా థియేటర్‌లో విడుదలవుతుండటం చాలాఎగ్జైటింగ్‌గా ఉంది` అని తెలిపారు.
`ఎంసీఏ` సినిమాకు `టక్ జగదీష్ `సినిమాకంటే తక్కువగా రివ్యూలు వచ్చాయి. కానీ నా కెరీర్‌లో ఎంసీఏ బ్లాక్ బస్టర్ హిట్. అయితే `వీ`, `టక్ జగదీష్` సినిమాల పట్ల నిర్మాతలు, అమెజాన్ కూడా హ్యాపీగా ఉంది. హయ్యస్ట్ వ్యూస్, సబ్ స్క్రిప్షన్స్ పెరిగాయని అన్నారు. థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా సినిమాలు చేయాలి. ఏ రోజైతే థియేటర్లు స్టార్ట్ అవుతాయో ఆ రోజు ఇలాంటి ఓ సినిమాను రెడీగా పెడతాను అని నాకు తెలుసు. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమైనా అవుతుందా? అనే భయాలేవి నాకు లేవు. జెర్సీ తరువాత నాకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్` అని తెలిపారు.
సిరివెన్నెల తమ సినిమాలోపాట రాయడంపై స్పందిస్తూ, సిరివెన్నెల గారు మాకు పాట రాయడం ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఆ పాటలోనే సినిమా మొత్తం చెప్పేశారు. అలాంటి రచయిత ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి ఓ పాట రాయాలంటే ఇప్పుడు ఎవరు లేరు. ఎండ్ ఆఫ్ ది ఎరా. అలాంటి పాట ఆయన `శ్యామ్ సింగ రాయ్`కు రాయడం వరం. ఇది ఆయన్ను సెలెబ్రేట్ చేసుకునే బాధ్యత మా మీద పెట్టినట్టు అయింది. ఇది మాకు ఎమోషనల్ ఎలిమెంట్ అయింది` అన్నారు నాని. ప్రస్తుతం `అంటేసుందరానికీ`, `దసరా` చిత్రాల్లో నటిస్తున్నానని, `దసరా` చిత్రంలో తెలంగాణ యాస మాట్లాడతానని తెలిపారు.
నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయంతెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్నారు. మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయడంపై నాని స్పందిస్తూ `ఈగ` సినిమాతో సౌత్ అంతా కూడా బాగా పాపులర్ అయ్యాను. నాని అంటే మా హీరో అన్నంతగా మారిపోయాను. చెన్నై, బెంగళూరు వంటి చోట్లకు వెళ్తే జనాలు ఎంతో ప్రేమను చూపిస్తుంటారు` అని చెప్పారు.