MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాని సినిమాపై సాయిపల్లవి హాట్‌ కామెంట్‌.. అలాంటి పాత్రలు చేయలేనంటూ స్టేట్‌మెంట్‌

నాని సినిమాపై సాయిపల్లవి హాట్‌ కామెంట్‌.. అలాంటి పాత్రలు చేయలేనంటూ స్టేట్‌మెంట్‌

సాయిపల్లవి.. నో డౌట్‌ సహజమైన నటి. ఆమె నటన, డాన్సులు ఎంత సహజంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. `ఫిదా`, `ఎంసీఎం`, `లవ్‌ స్టోరీ` వంటి చిత్రాల్లో చూపించింది. అద్భుతమైన నటన, డాన్సులతో మెస్మరైజ్‌ చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 21 2021, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సాయిపల్లవి(Sai Pallavi) తాజాగా ఓ హాట్‌ కామెంట్‌ చేసింది. నాని హిట్‌ సినిమా `ఎంసీఎం`(MCA)పై తనకు సెట్‌ కాదంటూ ఆసక్తికర కామెంట్‌ చేసింది. అలాంటి పాత్రల్లో తాను కంఫర్ట్ గా ఉండలేనని చెప్పింది. అలాంటి పాత్రలు చేయడమనేది ఆత్మ ఒకచోట, బాడీ మరో చోట ఉన్నట్టు అనిపిస్తుందని పేర్కొంది. `ఎంసీఏ` సగం షూటింగ్‌ అయ్యాక ఆ విషయం తనకు అర్థమైందని పేర్కొంది. తాను ఏ సినిమా చేసినా అందులో తాను కనిపించాలని, అది తనకు హెల్ప్ అయ్యేలా ఉండాలని, తనలోని నటన మరింతగా బయటకు తెప్పించేలా ఉండాలని చెప్పింది.  మొత్తంగా నాని సినిమా చేయడం కరెక్ట్ కాదని రియలైజ్‌ అయినట్టు పేర్కొందీ నేచురల్‌ హీరోయిన్‌. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

సాయిపల్లవి ఇటీవల `లవ్‌ స్టోరి` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఫిదా చేసింది. ఇప్పుడు మరోసినిమాతో రాబోతుంది. `ఎంసీఏ` తర్వాత Naniతో కలిసి మరోసారి `శ్యామ్‌సింగరాయ్‌`(Shyam Singha Roy) చిత్రంలో నటించింది. `టాక్సీవాలా` ఫేమ్‌ రాహుల్‌ సాంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా Sai Pallavi మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. 

37

ఇందులో తాను దేవదాసి పాత్రలో కనిపించబోతున్నట్టు చెప్పింది. ఆ పాత్ర కోసం చాలా కష్టపడిందట. తనకు ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది చాలా టఫ్‌ రోల్‌ అని పేర్కొంది. అయితే ఇందులో ఇంకా కొంచెం అసంతృప్తి ఉందని, ఇలాంటి మరో పాత్ర వస్తే సంతృప్తిగా నటిస్తానని, ఆ లోటుని కంప్లీట్‌ చేసుకుంటానని చెప్పింది. నానితో నటించడం వండర్‌ఫుల్‌ ఎక్స్ పీరియెన్స్ అని పేర్కొంది.  దర్శకుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ క్లారిటీ ఉన్న దర్శకుడు అని, ఆయనకు ఏం కావాలో క్లారిటీగా తెలుసు అని, ఎంత వరకు నటించాలో పర్‌ఫెక్ట్ గా చెబుతాడని చెప్పింది. ఆర్టిస్టులను బాగా గైడ్‌ చేస్తాడని చెప్పింది. 

47

ఇక ప్రస్తుతం `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలోని `ప్రణవాలయ` పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ పాట గురించి చెబుతూ, ఈ పాటకి చాలా కష్టపడినట్టు చెప్పింది. ఈ పాటలో నర్తించాలంటే శాస్త్రీయ డాన్సుపై అవగాహన ఉండాలని, కానీ తాను పగలు రిహార్సల్‌ చేసి, రాత్రి సమయంలో డాన్సు చేసేదట. చాలా టఫ్‌గా సాగిందని చెప్పింది. ఈ పాటకి ఇంతటి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని తెలిపింది. 

57

ప్రారంభం నుంచి తనకు చిత్ర పరిశ్రమ నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని, ఈ ప్రేమని తనకు గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. ఇలాంటి పాత్రలు రావడం దర్శకులకు ఆ క్రెడిట్‌ దక్కుతుందని చెప్పింది. దర్శకులు తనకు బలమైన పాత్రలు ఇవ్వడం వల్లే తాను నటించగలుగుతున్నానని చెప్పింది. తనపై ఇంతటి ప్రేమ చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా, గౌరవంగా ఉందని పేర్కొంది. హీరోలకు సమానంగా తనని ట్రీట్‌ చేయడం, సినిమా పోస్టర్లపై కూడా తనకు ప్రయారిటీ ఉండటం, తన కోసం ఆడియెన్స్  థియేటర్ కి రావడం అదృష్టమని చెప్పింది.
 

67

ఇటీవల శ్యామ్‌సింగరాయ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎమోషనల్‌ అయిన విషయం చెబుతూ, తన పాటకి అద్భుతమైన స్పందన లభించిందని, ఆ పాట విన్నాక అంతా అరుస్తూ గోల చేయడం, సాయిపల్లవి అంటూ సౌండ్‌ చేయడం, పైగా గెస్ట్ లు కూడా పాట గురించి, తన డాన్సు గురించి ప్రశంసిస్తుంటే చాలా ఎమోషనల్‌ అయిపోయానని తెలిపింది సాయిపల్లవి. 
 

77

మూడేళ్ల క్రితం ఓకే చెప్పిన సినిమాలు ఇప్పుడు ఒకేసారి విడుదలవుతున్నాయని చెప్పిన సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో `విరాటపర్వం` లో నటిస్తున్నట్టు చెప్పింది. ఇది షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతుందట. తమిళంలో ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు పేర్కొంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాని (నటుడు)
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved