సారాంశం


హీరో మహేష్ బాబు కొంచెం ఆలస్యంగా తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై స్పందించారు. ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు ఆసక్తికర కామెంట్ చేశారు. 
 

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలతో పాటు స్పోర్ట్స్, సోషియో అండ్  పొలిటికల్ ఇష్యూస్ పైన కూడా స్పందన తెలియజేస్తారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మారింది. బీఆర్ఎస్ ఓటమి చెందగా కాంగ్రెస్ పార్టీ 64 అసెంబ్లీ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి అనుముల తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 

నూతన ముఖ్యమంత్రికి చిత్ర పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొంచెం ఆలస్యంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా... ''తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అనుముల గారికి నా శుభాకాంక్షలు. మీ పాలనలో రాష్ట్రం మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. అభివృద్ధి, సంక్షేమంలో ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను'' అని కామెంట్ పోస్ట్ చేశారు. 

నాని ఆలోచన అలా ప్రేక్షకుల టేస్ట్ ఇలా... దెబ్బకు థింకింగ్ మారిపోలా!

మహేష్ బాబు ట్వీట్ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి అనుములతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రము మరింత అభివృద్ధి, సంక్షేమం సాధించాలని కోరుకున్నారు. రవితేజతో పాటు మరికొందరు చిత్ర ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

కాగా అల్లు అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంది. గత ప్రభుత్వాలు కూడా తెలుగు సినిమా అభివృద్ధికి దోహదం చేశాయి. త్వరలో పరిశ్రమ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని ఆయన అన్నారు. కొద్దిరోజుల్లో టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, పరిశ్రమకు సంబంధించిన ప్రతిపాదనలు సూచించనున్నారని తెలుస్తుంది.