MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాని ఆలోచన అలా ప్రేక్షకుల టేస్ట్ ఇలా... దెబ్బకు థింకింగ్ మారిపోలా!

నాని ఆలోచన అలా ప్రేక్షకుల టేస్ట్ ఇలా... దెబ్బకు థింకింగ్ మారిపోలా!

టైర్ టు హీరోల్లో టాప్ లో ఉన్న నానికి హాయ్ నాన్న మూవీతో ఎదురుదెబ్బ తగిలింది. ఫస్ట్ డే అసలు నాని కూడా ఊహించనంత ఫిగర్స్ నమోదు అయ్యాయి.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 08 2023, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Nani

Nani

హీరో నానికి చెప్పుకోదగ్గ మార్కెట్, ఫ్యాన్ బేస్ ఉన్నాయి. చెప్పాలంటే టైర్ టు హీరోల్లో నెంబర్ వన్ అనొచ్చు. ఒక దశలో ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. నాని సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నట్లు పరిస్థితి ఉండేది. అయితే కొన్నాళ్లుగా నాని బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Nani

Nani

నాని సినిమాల ఎంపిక అద్భుతంగా ఉంటుంది. కొత్త పాత అనే తేడా లేకుండా స్క్రిప్ట్ నచ్చితే ఏ దర్శకుడికైనా అవకాశం ఇస్తున్నాడు. స్క్రిప్ట్ నమ్మి చేసిన దసరా నానికి సూపర్ హిట్ ఇచ్చింది. కెరీర్ హైయెస్ట్ వసూళ్లు దసరాతో నాని అందుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కొత్తవాడు కావడం విశేషం.

37

అలాగే మరో యంగ్ డైరెక్టర్ శౌర్యుని నమ్మి హాయ్ నాన్న చిత్రం చేశాడు నాని. ఈ మూవీ ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మెజారిటీ వెబ్ సైట్స్ మెరుగైన రేటింగ్ ఇచ్చాయి. బాక్సాఫీస్ వద్ద అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. హాయ్ నాన్న నాని కెరీర్ లోయస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.

47

హాయ్ నాన్న ఫస్ట్ డే ఏపీ/తెలంగాణలలో కేవలం రూ.2.91 కోట్ల షేర్, రూ.5.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో నాని చిత్రాలకు విశేష ఆదరణ దక్కుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు సమానమైన వసూళ్ళు ఓవర్సీస్ లో నమోదు అయ్యాయి. హాయ్ నాన్న ఓవర్సీస్ లో ఫస్ట్ డే రూ.2.05 కోట్ల షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ హాయ్ నాన్న రూ.5.51 కోట్ల షేర్ వసూలు చేసింది. రూ.10.50 కోట్ల గ్రాస్ రాబట్టింది. 
 

57


నాని గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఏపీ/తెలంగాణ కలెక్షన్స్ చూస్తే... దసరా రూ.14.22 కోట్ల షేర్ తో టాప్ లో ఉంది. అంటే సుందరానికీ రూ.3.87 కోట్లు, శ్యామ్ సింగరాయ్ రూ.4.17 కోట్లు, గ్యాంగ్ లీడర్ రూ.4.57 కోట్ల షేర్ రాబట్టాయి. ఈ లెక్కన హాయ్ నాన్న ఎంత పెద్ద డిజాస్టర్ ఓపెనింగ్ నమోదు చేసిందో అంచనా వేయవచ్చు. 

67


సోషల్ మీడియాలో నానికి ఫ్యాన్స్ సలహాలు కూడా ఇస్తున్నారు. క్లాసిక్స్ ఎవరూ చూడటం లేదు. మాస్ కమర్షియల్ సబ్జక్ట్స్ ఎంచుకోండని తెలియజేస్తున్నారు. అంటే సుందరానికీ, హాయ్ నాన్న, జెర్సీ చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా నష్టాలు చవి చూశాయి. జెర్సీ బ్రేక్ ఈవెన్ కాకపోవడం షాకింగ్ పరిణామం.. 

77

హాయ్ నాన్న రిజల్ట్ తర్వాత నాని థింకింగ్ మారే అవకాశం లేకపోలేదు. ప్రయోగాల జోలికి పోకుండా కమర్షియల్ సబ్జక్ట్స్ పై దృష్టి పెట్టవచ్చు.  ప్రేక్షకులకు సరికొత్త చిత్రాలు అందించాలన్న నాని ఉద్దేశాన్ని ప్రేక్షకులు ఎంకరేజ్ చేయడం లేదు. కమల్ హాసన్ లాంటి హీరోలు కూడా ప్రయోగాలు చేసి పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. 

 

నాని సినిమాలో చేసిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా..? తెలిస్తే షాక్ అవుతారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాని (నటుడు)
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja: మట్టి వాసనను ప్రపంచానికి చూపించిన లెజెండ్రీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు
Recommended image2
Naga Chaitanya: సమంతతో మూవీ రిజెక్ట్ చేసిన చైతు, బ్యాడ్ లక్..3 సినిమాలు, ముగ్గురు హీరోలకు సూపర్ హిట్లు
Recommended image3
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved