కార్తీక్‌రాజు మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం ప్రారంభం ఎం.పూర్ణానంద్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్యక్రమానికి హ‌జ‌రైన సినిమా ప్ర‌ముఖులు
వింగ్స్ మూవీ మేకర్స్ బేనర్పై కార్తీక్రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో ప్రతిమ.జి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి కె.ఎస్.రామారావు వైజాగ్ రాజు తమ్మారెడ్డి భరద్వాజ కరుణాకరన్ దశరథ్ ఎం.ఎస్.ఎన్.సూర్య సందీప్ రెడ్డి హీరో కార్తీక్ రాజు హీరోయిన్ మిస్తి చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ సినిమాటోగ్రాఫర్ మల్హర్ భట్ జోషి తదితరులు పాల్గొన్నారు.
ముహుర్తపు సన్నివేశానికి ఎ.కరుణాకరన్ క్లాప్నివ్వగా, కె.దశరథ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి క్రాంతి మాధవ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కార్తీక రాజు మాట్లాడుతూ - నేను గతంలో రెండు సినిమాలు చేశాను. తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకుని మంచి కథలను ఎంపిక చేసుకున్నాను. అందులో డైరెక్టర్ పూర్ణానంద్గారు చెప్పిన ప్రేమకథ ఇది. డిఫరెంట్గా ఉంటుంది.
ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్లో కె.ఎస్.రామారావుగారి వంటి పెద్ద నిర్మాతతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను అన్నారు. దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ ఇదొక ప్రేమకథా చిత్రమ్ అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఇది సోషియో ఫాంటసీ ప్రేమకథాచిత్రమ్. ఫ్రెష్లుక్తో ఉంటుంది. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్లో ఇరవై రోజుల పాటు షెడ్యూల్ను ప్లాన్ చేశాం అన్నారు.
హీరోయిన్ మిస్తి చక్రవర్తి మాట్లాడుతూ - ఇప్పటి వరకు చూసిన ప్రేమకథలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. నా క్యారెక్టరైజేషన్ బావుంది అన్నారు.జెమినిసురేష్ మాట్లాడుతూ ఈ సినిమాలో నేనొక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. బ్యూటీఫుల్ లవ్స్టోరీ ఫాంటసీ కూడా మిళితమై ఉంటుంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ సినిమాలో ఐదు పాటలున్నాయి. మ్యూజిక్కు మంచి స్కోప్ ఉండే సినిమా అన్నారు. సినిమాటోగ్రాఫర్ మల్హర్ భట్ జోషి మాట్లాడుతూ లవ్ స్టోరీ విత్ సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కాబట్టి విజువల్గా నాకు చాలెంజింగ్గానే ఉంటుందనడంలో సందేహం లేదు. మంచి టీం కుదిరింది అన్నారు.
