మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన స్టార్ హీరో!

hero jai caught by chennai police
Highlights

గతంలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ హీరో జై మరోసారి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడడం హాట్ టాపిక్ గా 

గతంలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ హీరో జై మరోసారి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ సమయంలో జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ ను ఆరు నెలల పాటు నిషేధించారు. అయినప్పటికీ జైకి మాత్రం బుద్ది రాలేదనే చెప్పాలి.

తాజాగా ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా భారీ శబ్దాన్ని చేసే హై డెసిబుల్ సైలెన్సర్ ను ఉపయోగిస్తూ చెన్నైలో అడయార్ ప్రాంతంలో అతడి చేసిన చేష్టలు సీసీ కెమెరాకు చిక్కాయి. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతడు చేసిన తప్పుని అంగీకరించిన జై రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. తన కారుకి అమర్చిన హై డెసిబుల్ సైలెన్సర్ ను తొలగించనున్నట్లు వెల్లడించారు.

రీల్ లైఫ్ లో ఎంతో ఉన్నంతంగా కనిపించే జై రియల్ లైఫ్ లో మాత్రం ఇలా తప్పులు చేస్తూ దొరుకుతుండడంతో అతడికి కఠిన శిక్షలు విధించాలని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

loader