ఓపిక కాదు.. ఊపిరి ఉన్నంత వరకు ఎదురుచూస్తాం

hero allu arjun tweet to his fans over movie
Highlights

సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ బాక్సాఫీసు ఎదుట బెడసి కొట్టింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్ అంతా నిరాశ చెందారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ‘నా పేరు సూర్య , నా ఇల్లు ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ బాక్సాఫీసు ఎదుట బెడసి కొట్టింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్ అంతా నిరాశ చెందారు. అప్పటి నుంచి ఆయన మళ్లీ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

కానీ.. ఇప్పటి వరకు ఆయన ఏ కొత్త సినిమా ఒప్పుకున్నట్లు ప్రకటించలేదు. దీంతో.. ఆయనకు అభిమానులు సోషల్ మీడియా ద్వారా కొత్త సినిమా వివరాలు చెప్పాలంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారట. వారందరి కోసం అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు.

‘‘ ప్రియమైన అభిమానులారా.. నాపై ఇంత అభిమానం చూపించినందుకు చాలా థ్యాంక్స్. నా కొత్త సినిమా వివరాలు తెలుసుకునేందుకు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో మీరంతా కాస్త ఓపిక పట్టాలి. నా కొత్త సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. కానీ.. ఈసారి మంచి సినిమాతో మీ ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాను. కాబట్టి కొంచెం సమయం పడుతుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.’’ అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

కాగా.. అల్లు అర్జున్ ట్వీట్ కి అభిమానులు స్పందిస్తున్నారు. ‘‘ ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు ఎదురు చూస్తాం’’ అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
 

loader