RRR first glimpse: ఫెరోషియస్, ఫియర్ లెస్ భీమ్-రామ్- గూస్ బంప్స్ గ్యారంటీ!
45సెకన్ల నిడివి కలిగిన RRR first glimpse సగటు సినిమా అభిమానికి గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. శాంపిల్ ఈ రేంజ్ లో ఉంటే అసలు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అన్న భావన ఏర్పడేలా చేసింది.
రాజమౌళి- రామారావు -రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ గ్లిప్స్ వీడియో వచ్చేసింది. జక్కన్న చెక్కిన శిల్పానికి వంక పెట్టడానికి వీలుండదు అని మరోసారి నిరూపించారు ఆయన. దీనిని పాన్ ఇండియా చిత్రం అనడం కంటే పాన్ వరల్డ్ మూవీ అనడమే కరెక్ట్. దేశంలోని ఐదు భాషలతో పాటు ప్రపంచ బాషలలో విడుదలవుతున్న ఆర్ ఆర్ ఆర్ కి పాన్ వరల్డ్ అనే పదం సమంజసమే. కాగా 45సెకన్ల నిడివి కలిగిన RRR first glimpse సగటు సినిమా అభిమానికి గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. శాంపిల్ ఈ రేంజ్ లో ఉంటే అసలు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అన్న భావన ఏర్పడేలా చేసింది.
ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో సాగింది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ ఉండనుందన్న విషయం అవగతం అవుతుంది. బ్రిటీష్ వారిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసే పోరాటాల సమాహారమే ఆర్ ఆర్ ఆర్. దీని కోసం రక్తం చిందించిన ఈ వీరులిద్దరూ చేసిన పోరాటాలు, వేసిన ఎత్తులు ఆకట్టుకోనున్నాయి. బ్రిటీష్ వారిని బోల్తాకొట్టించడం కోసం చరణ్, ఎన్టీఆర్ ల మారు వేషాలు ప్రత్యేకంగా నిలిచే అవకాశం కలదు. టీజర్ లో ఎన్టీఆర్ ని వెంబడిస్తున్న పులి చూడవచ్చు, అలాగే టీజర్ చివర్లో పులి బ్రిటీష్ సైన్యంపై దాడి చేస్తుంది. ఎన్టీఆర్ పులిని మచ్చిక చేసుకొని తన పోరాటానికి వాడుకుంటాడేమో అనే సందేహం కూడా కలుగుతుంది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ చాలా ఫెరోషియస్, ఫియర్ లెస్ గా కనిపించారు. ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో లో అలియా భట్, అజయ్ దేవ్ గణ్, రామకృష్ణ వంటి యాక్టర్స్ ని చూడవచ్చు. ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ జస్ట్ అలా తళుక్కున మెరిశారు. మొత్తంగా ఫస్ట్ గ్లిమ్ప్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.
ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలకు చెందిన ఉద్యమ వీరులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత కథల ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది. అయితే ఆ పాత్రలను స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి కాల్పనికత జోడించి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. అసలు చరిత్రతో ఈ మూవీకి ఎటువంటి సంబంధం ఉండదు. అల్లూరి పాత్ర చేస్తున్న రామ్ చరణ్ గెటప్స్ ద్వారా ఈ విషయం ఇప్పటికే అర్థం అవుతుంది. Ram charan ఫస్ట్ లుక్ వీడియోతో పాటు ఇటీవల విడుదలైన పోస్టర్స్ లో ఆయన పోలీస్ గెటప్ లో కనిపించారు. ఇక కొమరం భీమ్ గా రాటు తేలిన శరీరంతో చాలా మొరటు లుక్ లో Ntr కనిపించారు. ఆయన పాత్ర ఊహించినదానికంటే మరింత అగ్రెస్సివ్ గా ఉంటుందని అర్థం అవుతుంది.
Also read 'ఆర్‌ఆర్ఆర్' టీజర్..ఆశ్చర్యపరిచే ఓ నిజం
నిర్మాత డివివి దానయ్య రూ 400 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు. శ్రీయ, సముద్ర ఖని వంటి స్టార్ క్యాస్ట్ ఆర్ ఆర్ ఆర్ లో భాగం అయ్యారు. Rajamouli ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also read 'ఆర్.ఆర్.ఆర్' USA టిక్కెట్ రేట్లు: బాహుబలి కన్నా తక్కువే