Asianet News TeluguAsianet News Telugu

'ఆర్‌ఆర్ఆర్‌' టీజర్..ఆశ్చర్యపరిచే ఓ నిజం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను చేరుకోవడానికి, మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్లను పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన నా పోస్టర్లు అలాగే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ టీచర్లతో ఈ సినిమాపై చాలా అంచనాలు క్రియేట్ చేశాడు రాజమౌళి.

RRR teaser will not have any dialogue
Author
Hyderabad, First Published Nov 1, 2021, 9:44 AM IST

భారీ ఎక్సపెక్టేషన్స్ తో 'ఆర్‌ఆర్ఆర్‌'  సినిమా టీజర్ ఈ రోజు 11 గంటలకు రాబోతున్నసంగతి తెలిసిందే. 'ఆర్‌ఆర్ఆర్‌' ప్రమోషన్ ను మొదలు పెట్టడంలో భాగంగా నవంబర్‌ 1వ తారీకున భారీ ఎత్తున గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నారు.ఆ గ్లిమ్స్ ను ఇప్పటికే ముంబైలో మీడియాకు చూపించటం జరిగింది. వారు చాలా అద్బుతంగా ఉందంటూ కామెంట్స్ చేయడం.వాటిని ఆర్ ఆర్ ఆర్‌ అఫిషియల్‌ ట్విట్టర్ పేజీలో ట్వీట్‌ చేయడం కూడా జరిగింది.అలాగే ఈ టీజర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం కూడా ముంబై సర్కిల్స్ లో వినపడుతోంది. 

అదేమిటంటే...ఈ టీజర్ కేవలం 45 సెకండ్ల వీడియోనే..కానీ చూసినకొద్ది మళ్ళీ చూడాలనిపిస్తుంది.  అద్బుతమైన  సీక్వెన్స్,మూమెంట్స్ తో ఈ టీజర్ ని నింపేసారు. అంతేకాకుండా ఈ టీజర్ కేవలం కీరవాణి సౌండ్ ట్రాక్ తోనే రన్ అవుతుంది. డైలాగ్స్ అనేవి ఉండవు. కాబట్టి హీరోలు ఇద్దరూ చెప్పే ఎమోషన్ లేదా పంచ్ డైలాగ్స్ కోసం ఎదురుచూడద్దు అంటున్నారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కు సంబంధించి ఇప్పటికే హీరోల లుక్స్ మరియు నేపథ్యం క్లారిటీ వచ్చింది.కనుక అంతకు మించి అన్నట్లుగా గ్లిమ్స్ లో ఉందంటున్నారు. 
 
 మరో ప్ర్కక రాజమౌళి మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు ఇటీవల ముంబయి పీవీఆర్‌ కు వెళ్లారు. అక్కడ పీవీఆర్ తో ప్రమోషన్‌ భాగస్వామ్యం చేసుకున్నారు.పీవీఆర్‌ ను కాస్త పీవీఆర్‌ఆర్‌ఆర్‌ గా మార్చేసిన విసయం తెల్సిందే. ఆ సమయంలోనే ఈ గ్లిమ్స్ వీడియోను స్క్రీనింగ్ చేయడం జరిగిందట.పెద్ద ఎత్తున అంచనాల నడుమ రూపొందిన సినిమా అవ్వడం వల్ల గ్లిమ్స్ సహజంగానే ఆ రేంజ్ లో ఉన్నాయి.అందుకే చూసిన వారు ఆశ్చర్యంలోమునిగిపోయారు అంటున్నారు. 

 తెలుగులో స్టార్స్ గా వెలుగుతున్న రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. దానికి తోడు ఫ్లాఫ్ అంటూ ఎరగని రాజమౌళి డైరక్టర్ కావటం, అదీ బాహుబలిలాంటి భాక్సాఫీస్ హిట్ తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం వంటివి ఈ సినిమాకు ఎక్కడలేని హైప్ తెచ్చాయి. దాంతో ఈ సినిమాపై ఒక్క టాలీవుడ్‌ కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా తో సహా రకరకాల కారణాలతో ఇప్పటికే పలుసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు ఓపినింగ్స్,కలెక్షన్స్ ఓ రేంజిలో ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios