Asianet News TeluguAsianet News Telugu

'ఆర్.ఆర్.ఆర్' USA టిక్కెట్ రేట్లు: బాహుబలి కన్నా తక్కువే

 ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా విషయానికొస్తే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం పాటు షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. 

RRR USA ticket rates Lesser Price than Baahubali
Author
Hyderabad, First Published Oct 31, 2021, 1:15 PM IST

బాహుబలి చిత్రం ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్‌లోనే కాకుండా జపాన్‌, చైనాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్ కలెక్షన్స్ అందించింది. ఇక రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న తాజాగా చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌ను కూడా అదే స్థాయిలో ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాని అమెరికాలో సరిగమ సినిమాస్, రఫ్తర్ క్రియేషన్స్ వారు కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమా ప్రీమియర్ షోలకు, రెగ్యలర్ షోలకు ఎంత టిక్కెట్ రేట్ పెట్టబోతన్నారనేది అక్కడ సినీ అభిమానుల్లో చర్చగా మారింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా  టిక్కెట్ రేట్లు బాహుబలి 2 కన్నా తక్కువగా ఉండబోతున్నాయి. కరోనాతో దెబ్బ తిన్న యుఎస్ మార్కెట్ ని  లేపటానికి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  అవి ఈ క్రింద విధంగా ఉన్నాయి.

ఆర్.ఆర్ ఆర్ యుఎస్ ఎ టిక్కెట్ రేట్లు:
(జనవరి 6 ప్రీమియర్స్ నుంచి ఓ వారం దాకా)  

తెలుగు:
పెద్దలకు – $23, పిల్లలకు – $18
Large Format like XD, RPX or any PLF screen: పెద్దలకు – $27, పిల్లలకు – $20
IMAX / D-Box / Dolby Cinema:
పెద్దలు – $30, పిల్లలు – $23.

హిందీ/తమిళం/మళయాళం/కన్నడ:
పెద్దలు – $16, పిల్లలు – $12
Large Format like XD, RPX or any PLF screen / IMAX / D-Box / Dolby Cinema:
Adult/Senior/General – $20, Child – $15
 
 
 తెలుగులో స్టార్స్ గా వెలుగుతున్న రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. దానికి తోడు ఫ్లాఫ్ అంటూ ఎరగని రాజమౌళి డైరక్టర్ కావటం, అదీ బాహుబలిలాంటి భాక్సాఫీస్ హిట్ తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం వంటివి ఈ సినిమాకు ఎక్కడలేని హైప్ తెచ్చాయి. దాంతో ఈ సినిమాపై ఒక్క టాలీవుడ్‌ కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా తో సహా రకరకాల కారణాలతో ఇప్పటికే పలుసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు ఓపినింగ్స్,కలెక్షన్స్ ఓ రేంజిలో ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios