Asianet News TeluguAsianet News Telugu

దిశా మరణించిన రాత్రి ఏం జరిగిందంటే? మరో కోణం వెల్లడించిన స్నేహితురాలు

సుశాంత్‌ కేసులో ఆయన మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ మరణం కూడా కీలకంగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు బీజేపి ఎంపీ నారాయణ్‌ రాణే పలు సంచలన ఆరోపణలు చేశారు. 

her friend said another aspect in the disha salian case
Author
Hyderabad, First Published Aug 8, 2020, 8:19 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆత్మహత్యగా భావించిన ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. రోజుకో కొత్త విషయం బయటకు వస్తూ షాక్‌కి గురి చేస్తుంది. ఆత్మహత్య చేసుకోవడానికి వెనకాల అనేక మానసిక ఇబ్బందులకు, ఒత్తిడికి గురైనట్టు తెలుస్తుంది. ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి ఇందులో ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలో సీబీఐ, ఈడీ ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో పలు షాకింగ్‌ విషయాలను ఆమె నుంచి తెలుస్తున్నాయి. 

అయితే సుశాంత్‌ కేసులో ఆయన మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ మరణం కూడా కీలకంగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు బీజేపి ఎంపీ నారాయణ్‌ రాణే పలు సంచలన ఆరోపణలు చేశారు. దిశ ఆత్మ‌హ‌త్య చేసుకోలేద‌ని, అత్యాచారం చేసి చంపేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. జూన్ తొమ్మిదిన దిశ మ‌ర‌ణిస్తే, జూన్ 11న తన మృతదేహానికి పోస్టుమార్టం జ‌ర‌ప‌డంపైనా పలువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

సుశాంత్ సూసైడ్ కేసు: రియా కాల్‌ లిస్ట్‌లో సంచలన విషయాలు

దీంతో దిశా మరణించిన రాత్రిఏం జరిగింది? ఆమె పాల్గొన్న పార్టీలో ఎవరెవరున్నారు? తనని పెంట్‌ హౌజ్‌కి పిలిచిందెవరు, సుశాంత్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ఏం చెప్పాలనుకున్నారనేది ఇప్పుడు ఆద్యంతం ఆసక్తిని, ఉత్కంఠతని రేకెత్తిస్తున్నాయి. దీనిపై దిశా స‌లియాన్ స్నేహితురాలు ఒకరు పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. జూన్‌ తొమ్మిది రాత్రి, ముంబైలోని మ‌లాద్ ప్రాంతంలోని ప్రియుడు రోహాన్ నివాసం ఉందని, దిశ త‌న బాయ్‌ఫ్రెండ్‌తో పాటు‌‌, మ‌రికొంత‌మంది స్నేహితు‌లతో క‌లిసి పార్టీ చేసుకుందని, మ‌ద్యం ఎక్కువ‌గా తాగిన ఆమె ఒక్క‌సారిగా ఏడుస్తూ ఎవ‌రూ ఎవ‌రికోసం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిందన్నారు. 

దీంతో అక్క‌డ ఉన్న‌ ఓ స్నేహితుడు పార్టీ నాశ‌నం చేయొద్ద‌ని కోరారు. వెంట‌నే ఆమె త‌న‌ బెడ్‌రూంలోకి వెళ్లి గ‌డియ పెట్టుకుందని, ఎంత‌సేప‌టికీ తిరిగి రాక‌పోవ‌డంతో ఆమె ప్రియుడు, ఇత‌ర మిత్రులు వెళ్లి త‌లుపు త‌ట్టారు. అటువైపు నుంచి స్పంద‌న రాక‌పోవడంతో బ‌లంగా త‌లుపును గుద్ది తెరిచేస‌రికి ఆమె అక్క‌డ క‌నిపించ‌లేదు. లోనికి వ‌చ్చి చూడ‌గా ఆమె బాల్క‌నీలో నుంచి దూకి మెట్ల‌పై ప‌డిపోయి క‌నిపించింది. అప్ప‌టికీ ఆమె కొన‌ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. వెంట‌నే వాళ్లు కింద‌కు వెళ్లి ఆమెను ఆస్ప‌త్రికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఆమెను చేర్పించుకునేందుకు మూడు ఆస్ప‌త్రులు తిర‌స్క‌రించిన త‌ర్వాత‌ నాలుగో ఆసుపత్రి చేర్పించుకుందని, కానీ అప్ప‌టికే దిశ మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలినట్టు స్నేహితురాలు పేర్కొన్నారు. 

రియా చక్రవర్తికి ఈడీ షాక్‌.. విచారణకు హాజరు కావాల్సిందే

ఆమె అత్యాచారానికి గురి కావడం వల్లే అలా ప్రవర్తించిందని, ఆ విషయాన్నే సుశాంత్‌కి చెప్పిందనే వాదన వినిపిస్తుంది. బీజేపీ నాయకుడు నారాయణ్‌ రాణే కూడా ఇదే ఆరోపిస్తున్నారు. అత్యాచార విష‌యాన్నిదిశ సుశాంత్‌కు చెప్పింద‌ని దీంతో వాళ్లు అత‌డిని వేధించ‌డం మొద‌లు పెట్టార‌ని, అందుకే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇందులో రియా ప్రమేయం ఏంటనేది మరో ఆసక్తికరంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios