అఖిల్ సినిమాకు అరుదైన గౌరవం!

hello movie nominated for best action film in a foreign
Highlights

అక్కినేని అఖిల్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'హలో' సినిమాలో నటించిన సంగతి 

అక్కినేని అఖిల్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'హలో' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 'అఖిల్' సినిమా ఫెయిల్యూర్ తో ఉన్న ఈ అక్కినేని వారసుడికి 'హలో' ఒకింత ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాకు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు అదే కేటగిరీలో ఈ సినిమాలో అరుదైన గౌరవం దక్కడం విశేషం. వరల్డ్ స్టంట్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో బెస్ట్ యాక్షన్ చిత్రంగా 'హలో' నామినేట్ అయింది.

 

ఈ విషయాన్ని దర్శకుడు విక్రమ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలపడంతో పాటు అఖిల్ చేసిన హార్డ్ వర్క్ ను గుర్తు చేసుకున్నారు. 'నీ యాటిట్యూడ్ నిన్ను మరింత  ముందుకు నడిపిస్తుంది' అంటూ అఖిల్ కితాబిచ్చారు. గతేడాది డిసంబర్ లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. 

loader