నోటికొచ్చినట్లు మాట్లాడకండి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై బాలకృష్ణ కామెంట్స్!

He will always be 'anna' to me says aadarsh balakrishna about jr ntr
Highlights

తారక్ అన్న అభిమానులందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ ని ట్విట్టర్ లో కాపీ చేసి పెట్టాను. దాంతో తారక్ ఇన్స్టాగ్రామ్ ఐడీ కాపీ అయిపోయింది. సో.. కూల్ అవ్వండి.. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆపండి. తారక్ నాకు కూడా ఎప్పటికీ అన్నయ్యే

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కొన్ని సినిమాల్లో నటించిన ఆదర్శ్ బాలకృష్ణ బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్స్ వరకు వెళ్లి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. 'అరవింద సమేత' సినిమాలో ఆదర్శ్ కు కీలకపాత్ర దక్కడంతో ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తారక్, త్రివిక్రమ్ లతో తీసుకున్న ఫోటోను షేర్ చేశాడు.

అయితే తారక్ కి గౌరవడం ఇవ్వకుండా 'jrntr' హ్యాష్ ట్యాగ్ జత చేయడం అభిమానులకు నచ్చలేదు. తారక్ గారు లేదంట అన్నయ్య అని పిలవకుండా జూ.ఎన్టీఆర్ అని పెట్టడం ఏంటని అతడిపై ఫైర్ అయ్యారు. తారక్ ని మేము దైవంగా భావిస్తామని ఆయనకు మర్యాద ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ ఆదర్శ్ పై విరుచుకుపడ్డారు. దీనిపై స్పందించిన ఆదర్శ్..

'తారక్ అన్న అభిమానులందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ ని ట్విట్టర్ లో కాపీ చేసి పెట్టాను. దాంతో తారక్ ఇన్స్టాగ్రామ్ ఐడీ కాపీ అయిపోయింది. సో.. కూల్ అవ్వండి.. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆపండి. తారక్ నాకు కూడా ఎప్పటికీ అన్నయ్యే' అని ట్వీట్ చేశారు.  
 

loader