బిగ్ బాస్ షోతో వచ్చిన పాపులారిటీని హరితేజ సద్వినియోగం చేసుకుంటోంది. ఈ షో కంటే ముందు ఆమె పలు చిత్రాల్లో నటించినా అంతగా పాపులారిటీ రాలేదు. బిగ్ బాస్ తర్వాత హరితేజ దశ తిరిగింది. సినిమా అవకాశాలతో పాటు... సినీ పరిశ్రమ బయట జరిగే ఇతర కార్యక్రమాల్లోనూ ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. సినిమా అవకాశాలే కాకుండా.. ఫిదా ప్రోగ్రాంతోపాటు అనేక ఛాన్స్‌ లను ఈ టాలెంటెడ్ లేడీ సొంతం చేసుకుంటోంది. దీపావళి సందర్భంగా ఏపీ సర్కారు నిర్వహించిన ‘తిరుపతి దీపావళి ఉత్సవం’ లోనూ ఆమె హోస్ట్‌ గా వ్యవహరించింది. ఇందులో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి కూడా ఆమెతో పాటు యాంకరింగ్ చేశారు. కార్యక్రమాన్ని వీరిద్దరూ సమర్థవంతంగా నడిపారు. ఒకరితో మరొకరు పోటీ పడి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.కానీ హరితేజ కాస్త ఓవర్ యాక్షన్ చేసిందని కొందరు అభిమానులు చెబుతున్నారు. వీరిద్దరి యాంకరింగ్ హాస్యాన్ని పంచినప్పటికీ.. జుగుప్సాకరంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. స్టేజీ మీద హరితేజ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. సెటైర్లు వేసుకోవడం కాస్త శ్రుతి మించిందంటున్నారు. హరితేజ లాంటి టాలెంటెడ్ పర్సన్ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.బిగ్ బాస్‌ షోలో అద్భుతంగా ఆకట్టుకున్న హరితేజ హరి కథ ఎపిసోడ్‌ను ఒంటి చేత్తో రక్తి కట్టించింది. దీంతో చాలా పాపులర్ అయింది. దీపావళి ఉత్సవంలో ఓ సందర్భంలో శివారెడ్డి స్టేజీ మీదకు రాక పోవడంతో హరితేజ తదనైన రీతిలో సెటైర్లు వేశారు. ఎంత పిలిచినా రానే రాడంట, ఎన్ని సార్లు చెప్పినా దాక్కొనే ఉంటాడంట.... శివా రెడ్డి కథ ఏందిరా... నా సామిరంగ ఈడు నాకు అర్థం కాడురా.... అంటూ హరితేజ తనదైన రీతిలో సెటైర్లు వేశారు. ఏంది రా ఓవర్ గా మిమిక్రి చేస్తున్నావ్ శివా రెడ్డి స్టేజీ మీదకు రాగానే.... మిమిక్రి చేసి.. డాన్స్ చేసి... పాటలుపాడి బాగా మెప్పించి... మా అందరినీ తొక్కేస్తున్న ఉన్నావ్... మేమెక్కడి పోవాలిరా.. ఓ శివారెడ్డి అంటూ హరితేజ ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో శివా రెడ్డి..... తస్సరవ్వల బొడ్డూ అంటూ మిమిక్రి చేశాడు. దీనికి వెంటనే హరితేజ స్పందిస్తూ... ఏంది రా ఓవర్ గా మిమిక్రీ చేస్తున్నావ్ అంటూ... అతడిపై సెటైర్లు వేసింది హరితేజ.  అయితే హరితేజ ఇలా ప్రవర్తించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.