తెలుగులో 'గబ్బర్ సింగ్' చిత్రంతో పాపులర్ అయిన దర్శకుడు హరీష్ శంకర్ ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లో మూడు సినిమాలు చేశాడు. గతేడాది విడుదలైన 'దువ్వాడ జగన్నాథం' సినిమా కూడా హరీష్ శంకర్-దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కిందే. అయితే హరీష్ తదుపరి సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉండాల్సింది. ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశాడు  

హరీష్. దీనికి 'దాగుడుమూతలు' అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ సినిమాను దిల్ రాజు లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రస్తుతం ఐదు సినిమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ ఐదు సినిమాల రిలీ డేట్లను  ప్రకటించారు. ముందుగా 'లవర్' సినిమా ఈ శుక్రవారం రాబోతుంది. అలానే నితిన్ 'శ్రీనివాసకళ్యాణం' ఆగస్టు 9న, రామ్ 'హలొ గురు ప్రేమకోసమే' అక్టోబర్  18న, వచ్చే ఏడాది జనవరి 12న 'ఎఫ్2', ఏప్రిల్ 5న మహేష్ బాబు సినిమా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు.

ఈ పోస్ట్ ను రీట్వీట్ చేసిన హరీష్ శంకర్ 'ఈ జాబితా నుండి నా సినిమా మిస్ అయింది. చాలా బాధగా ఉంది కానీ కొన్ని సార్లు కొన్ని తప్పవు. ఈ ఐదు సినిమాలు మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని వెల్లడించారు.