వాల్మీకి చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరుణ్ తేజ్ వరుసగా తొలిప్రేమ, ఫిదా లాంటి రొమాంటిక్ చిత్రాలు చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఓ మాస్ పాత్రకు అంగీకరించడం సాహసోపేత నిర్ణయమే. ఈ సాహసానికి అంగీకరించిన వరుణ్ కు థాంక్స్ అని హరీష్ తెలిపాడు. 

ఈ చిత్రంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే మధ్య వచ్చే ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. ఈ చిత్రంలో ఓ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేశారు. వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో రీమిక్స్ సాంగ్ అనగానే.. చిరంజీవి పాటా, పవన్ కళ్యాణ్ పాటా అని ప్రతి ఒక్కరు అడగడం ప్రారంభించారు. కానీ శ్రీదేవి, శోభన్ బాబు నటించిన దేవత చిత్రంలోని ఎల్లువొచ్చి గోదారమ్మా అనే పాటని రీమిక్స్ చేస్తున్నారు. 

ప్రత్యేకంగా ఆ సాంగ్ నే ఎంచుకోవడానికి కారణాన్ని హరీష్ వివరించారు. కథలో భాగంగా ఆ సాంగ్ ని ఎంచుకున్నాం. కేవలం కమర్షియల్ కోణంలో ఆలోచించలేదు. అలా అలోచించి ఉంటే చిరంజీవి గారి పాటో, పవన్ కళ్యాణ్ గారి పాటో ఎంచుకునేవాళ్ళం అని హరీష్ తెలిపాడు. 

ఆ సాంగ్ పై మీరు ఎంతగా ఊహించుకున్నా, ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అలరిస్తుందని హరీష్ తెలిపాడు. 

వరుణ్ తేజ్ 'వాల్మీకి' ట్రైలర్: గద్దలకొండ గణేష్ అంటే గజ గజ వణకాలి!