హీరోయిన్ మేనేజర్ కు ఏకంగా బిజేపీలో పదవి!

First Published 4, Jun 2018, 4:22 PM IST
harinath appointed as BJP movie cell state convenor
Highlights

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పిఆర్ బృందం బాగా పాపులర్ అయిన పేరు హరినాథ్.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పిఆర్ బృందం బాగా పాపులర్ అయిన పేరు హరినాథ్.. స్టార్ హీరోయిన్లందరికీ మేనేజర్ గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడుపుతుంటారు. రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, షాలిని పాండే ఇలా చాలా మంది తారల డేట్స్ ను చూస్తుంటారు.

జగపతిబాబు డేట్స్ ను కూడా చూసేది ఈయనే.. ఇప్పటివరకు సినిమాలకు పరిమితమైన హరినాథ్ ఇప్పుడు రాజకీయంగా కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజీపీ పార్టీ ఆయనకొక పదవిని కూడా ఇచ్చింది. 'తెలంగాణా బీజేపీ సినిమా సెల్ స్టేట్ కన్వీనర్' గా హరినాథ్ ను నియమించారు. సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్లు రాజకీయాల్లోకి వస్తుండడం చూస్తున్నాం.

కానీ ఇప్పుడు హీరోయిన్ల మేనేజర్ రాజకీయాల్లోకి రావడం విశేషమనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే వచ్చే ఏడాది ఎన్నికల్లో బీజేపీ పార్టీ తమ ప్రచారాల కోసం సినిమా తారలను వాడుకోబోతుందా..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

loader