అర్జునిడిగా నటించకలేకపోయానని ఒప్పుకున్న హరికృష్ణ!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 1, Sep 2018, 1:47 PM IST
harikrishna about arjuna role in dana veera soora karna movie
Highlights

నందమూరి హరికృష్ణ రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. సినిమాల పరంగా ఆయన కెరీర్ చాలా చిన్నదనే చెప్పాలి. హరికృష్ణ నటిస్తున్న సమయంలో మిగిలిన హీరోలతో పోల్చి చూస్తే ఆయన చాలా తక్కువ సినిమాల్లో నటించారు.

నందమూరి హరికృష్ణ రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. సినిమాల పరంగా ఆయన కెరీర్ చాలా చిన్నదనే చెప్పాలి. హరికృష్ణ నటిస్తున్న సమయంలో మిగిలిన హీరోలతో పోల్చి చూస్తే ఆయన చాలా తక్కువ సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాల్లోనే నటించినప్పటికీ తనదైన ముద్ర వేశారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన హరికృష్ణ యుక్తవయసుకి వచ్చిన తరువాత 'దాన వీర శూర కర్ణ' సినిమాలో అర్జునుడి పాత్ర పోషించాడు. ఆ పాత్ర విషయంలో హరికృష్ణ ఓ సందర్భంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తను ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయలేకపోయానని నిజాయితీగా అంగీకరించాడు. నిజానికి ఆ పాత్రను ముందుగా మరొక నటుడి కోసం అనుకోగా.. అతడు అందుబాటులో లేకపోవడంతో హరికృష్ణతో వేషం వేయించారట సీనియర్ ఎన్టీఆర్.

ఆ సినిమాకు ఆయనే దర్శకుడు. అప్పటికే ఆ సినిమాకు సంబంధించి చాలా వ్యవహారాలు హరికృష్ణ చూసుకునేవారట. తండ్రి మాట కాదనలేక నటించడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ పాత్రను సరిగ్గా పండించలేకపోయానని సినిమా నిర్మాణ బాధ్యతలతో సరిగ్గా నటించలేకపోయానని తన అభిప్రాయాన్ని చెప్పారు. 

ఇవి కూడా చదవండి.. 

హరికృష్ణ గురించి ఎవరికీ తెలియని విషయాలు!

హరికృష్ణను పోలీసులు ఆపితే ఏం చేశారో తెలుసా..?

loader