మెగా డాటర్ అనే ట్యాగ్ లైన్ తో  తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది నిహారిక. నాగశౌర్యతో కలిసి ఆమె చేసిన ‘ఒక మనసు’ చిత్రంతో నటిగా తానెంటో నిరూపించుకుంది. కానీ ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది. దీంతో.. అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది ఈ కొణిదెళ వారమ్మాయి. అక్కడ తమిళ హీరో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

 

ఓ వైపు తమిళ సినిమాలో నటిస్తూనే.. మరో వైపు తన తండ్రి మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ‘నాన్న కూచి’ పేరుతో వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఆమెకు  తెలుగులో మరో సినిమా అవకాశం వచ్చింది. నాగఅశ్విన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నిహారికను హీరోయిన్ గా ఎంపిక చేశారు.ఈ సినిమాకి ‘ హ్యాపీ వెడ్డింగ్’ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. కొత్త దర్శకుడు లక్ష్మి కార్యఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యూవీ   క్రియేషన్స్ సంస్థ, పాకెట్ సినిమా బ్యానర్ పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.