సంఘమిత్ర చిత్రంలోంచి తప్పుకున్న శృతీహాసన్ చారిత్రకంగా తెరకెక్కించాలని భావిస్తున్న దర్శకుడు సుందర్ సంఘమిత్ర పాత్రలో హాన్సికను తీసుకునే ఆలోచనలో సుందర్
బాహుబలి చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని అదే తరహాలో తమిళంలో సుందర్ దర్శకత్వంలో 'సంఘమిత్ర' అనే భారీ సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత శృతి హాసన్ ను అనుకున్నారు. పలు కారణాలతో ఈ సినిమా నుండి శృతి తప్పకుంది. దీంతో సంఘమిత్ర పాత్ర కోసం తమన్నా, అనుష్క, నయనతార తదితర హీరోయిన్ల పేర్లు పరిశీలించారు.
తాజాగా ఈ అవకాశం హన్సికకు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఇంకా ఫైనల్ కాలేదని చిత్ర యూనిట్ చెబుతున్నమాట. ఇంతకు ముందు ఈ చిత్రానికి అనుష్క, నయనతారల పేర్లు వినిపించాయి. అయితే వారి డేట్స్ ఖాళీ లేక పోవడంతో హన్సిక వైపు దర్శక నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు టాక్. అయితే హన్సికకు ఈ రోల్ అంతగా సూటవ్వదని, ఆమె కత్తిసాము లాంటి సీరియస్ సీన్స్ లో హాన్సిక ఎంత మేరకు చేయగలదని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో దర్శకుడు సుందర్.సి హాన్సిక ఈ పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తుందోనని అంచనాలు వేస్తున్నట్లు సమాచారం. గతంలో సుందర్.సి దర్వకత్వంలో 'అరణ్మనై', 'అరణ్మనై 2' చిత్రాల్లో హన్సిక నటించారు. తేనాండాల్ స్టూడియో లిమిటెడ్ సంస్థ రూ.300 కోట్లతో 'సంఘమిత్ర'ను ప్లాన్ చేస్తోంది. సుందర్.సి దర్శకత్వంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందనుంది.
