హమీదని అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ వారం హమీద ఎలిమినేట్‌ అవుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అందరు షాక్‌కి గురయ్యారు.  

బిగ్‌బాస్‌5 ఐదో వారం ఎలిమినేట్‌ అయ్యింది ఎవరో తెలిసిపోయింది. ప్రస్తుతం ఇంకా ప్రోగ్రామ్‌ జరుగుతుంది. `నవరాత్రిస్పెషల్‌`గా నాలుగు గంటల ప్రోగ్రామ్‌ కంటిన్యూ అవుతుంది. అయితే ఇందులో బ్రేక్‌లో అసలు విషయం తెల్చేశారు బిగ్‌బామ్‌ టీమ్‌. హమీదని అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ వారం హమీద ఎలిమినేట్‌ అవుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అందరు షాక్‌కి గురయ్యారు. 

ఈ వారం hamida ఎలిమినేట్‌ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఆమె sreeramతో పులిహోర కలుపుతుంది. ఈ లవ్‌ స్టోరీ ఆడియెన్స్ కి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెని ఇప్పట్లో ఎలిమినేట్‌ చేయరని అనుకున్నారు. కానీ అందరి ఊహాలకు షాక్‌ ఇచ్చారు. హమీదని ఎలిమినేట్‌ చేశారు. ముఖ్యంగా శ్రీరామ చంద్రకి బిగ్‌కి షాక్‌ ఇచ్చారు.

also read: బిగ్ బాస్ 5: నాగార్జునకే కన్నీళ్లు తెప్పించిన హౌస్ మేట్స్

శ్రీరామ్‌, హమీద రియల్‌ లవర్స్ లాగా ఉన్నారు. కెప్టెన్‌గా శ్రీరామ్‌ ఉన్నప్పుడు తనే కెప్టెన్ గా చేసింది హమీద. పైగా గ్లామర్‌ పరంగానూ హౌజ్‌ని అలరిస్తుంది. కానీ గేమ్‌ల పరంగా చాలా డల్‌గా ఉంది హమీద. అదే ఆమె ఎలిమినేషన్‌కి కారణమైందని అంటున్నారు నెటిజన్లు. సరైన పర్‌ఫెర్మెన్స్ లేకపోవడం వల్లే ఎలిమినేషన్‌ అయ్యిందని అంటున్నారు. పులిహోర కలపడం కంటే గేమ్‌ ముఖ్యమనే విషయం వెల్లడించారు ఆడియెన్స్. 

ఇప్పటికే Bigg Boss5లో ఈ ఆదివారం ఐదు వారాలు పూర్తయ్యింది. ఇందులో ఇప్పటికే సరయు, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్, లహరి ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు హమీద ఎలిమినేట్‌ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.