Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ చిరంజీవి మహావీర్ మోషన్ పోస్టర్ రాజమౌళితోనే..ఇక..

  • గ్రాండ్ గా మెగాస్టార్ చిరంజీవి 151 మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్
  • చిరంజీవి పుట్టినరోజు నాడు విడుదల కానున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మోషన్ పోస్టర్
  • ఐశ్వర్య, నయన్ హీరోయిన్లు, రాజమౌళి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్
grand event on mega star birthday for 151 motion poster release by rajamouli

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇటీవలే గ్రాండ్ గా పూడా కార్యకక్రమాలతో ప్రారంభమైన సంగతి  తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22వ తేదీన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

 

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా ఎఆర్ రెహమాన్ పక్కా అయ్యారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నయనతార ఓకె అయింది. మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ తో చర్చలు సాగుతున్నాయని ఇది కూడా పక్కా  కానుందని తెలుస్తోంది. మరి మెగాస్టార్ బర్త్ డే కల్లా ఫైనల్ అవుతుందా అనేది వేచిచూడాలి. ఐశ్వర్య ఈ ప్రాజెక్టుకు తోడయితే కచ్చితంగా మాంచి బజ్ వస్తుంది.

grand event on mega star birthday for 151 motion poster release by rajamouli

 

మరోపక్క కన్నడ స్టార్ సుదీప్ ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇలా సుదీప్, ఐశ్వర్య, నయనతార తోడయితే, పక్కాగా నేషనల్ రేంజ్ వస్తుంది. స్క్రిప్ట్ పక్కా గా సిద్దం చేసుకున్న తరవాతనే షూటింగ్ మొదలు పెట్టాలి అనేది చిరంజీవి లెక్క. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక అసలు గ్యాప్ లేకుండా చిత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని ఇప్పటికే సురేందర్ రెడ్డితో చిరు చెప్పేశాడట. వచ్చే సమ్మర్ లో తన చిత్రం విడుదలై తీరాలనేది చిరు మనసులోమాటగా తెలుస్తోంది. శ్రావణమాసం వెళ్లిపోతోంది కాబట్టి, చిరు బర్త్ డే దాకా ఆగకుండా మూవీ ప్రారంభించేశారని, అయితే అసలు ఫంక్షన్ చిరు బర్త్ డే నాడు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

grand event on mega star birthday for 151 motion poster release by rajamouli

ఇక చిరు 151 మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా జరగనున్నట్టు సమాచారం. ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ కి సంబంధించిన ఈవెంట్ ను ఘనంగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలకమైన పాత్రలో నటించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios