MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Pedarayudu Movie Review: చిరంజీవిని చావు దెబ్బకొట్టిన మోహన్ బాబు సినిమా, పెదరాయుడు రివ్యూ..

Pedarayudu Movie Review: చిరంజీవిని చావు దెబ్బకొట్టిన మోహన్ బాబు సినిమా, పెదరాయుడు రివ్యూ..

Pedarayudu Movie Review: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం విజయాలు సాధించడమే కాదు.. హీరోల ఇమేజ్‌ను, బాక్సాఫీస్ లెక్కలను, ప్రేక్షకుల అభిరుచులను కూడా ప్రభావితం చేస్తాయి. అలాంటి చిత్రాల్లో మోహన్ బాబు హీరోగా నటించిన ‘పెదరాయుడు’ ఒకటి.

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 21 2026, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెదరాయుడు బ్యాక్ గ్రౌండ్ స్టోరీ
Image Credit : Asianet News

పెదరాయుడు బ్యాక్ గ్రౌండ్ స్టోరీ

‘పెదరాయుడు’ సినిమా వెనుక ఆసక్తికరమైన బ్యాగ్రౌండ్ ఉంది. తమిళంలో శరత్ కుమార్ హీరోగా, విజయ్ కుమార్ ప్రధాన పాత్రలో తమిళ న దర్శకుడు కే.ఎస్. రవికుమార్ తెరకెక్కించిన ‘నాట్టమై’ (Nattamai) చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఈసినిమాను చూసిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, వెంటనే తన ఆప్తమిత్రుడు మోహన్ బాబుకి ఫోన్ చేసి ఈ సినిమాను చూసి తెలుగులో రీమేక్ చేయాల్సిందిగా సూచించారు.

రజనీకాంత్ సలహాతో సినిమా చూసిన మోహన్ బాబు.. ఈ కథకు బాగా అట్రాక్ట్ అయ్యారు. వెంటనే రీమేక్ హక్కులు తీసుకున్నారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టిని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు. తమిళంలో విజయ్ కాంత్ పోషించిన ఐకానిక్ తాత పాత్రను (పాపారాయుడు) తెలుగులో రజనీకాంత్ స్వయంగా వచ్చి ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించారు. రజనీకాంత్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడంలో ఆ పాత్ర కీలక పాత్ర పోషించింది.

1995లో విడుదలైన ఈ సినిమా కుటుంబ బంధాలు, గ్రామీణ నేపథ్యం, న్యాయం, ధర్మం, ఆత్మగౌరవం వంటి అంశాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పెదరాయుడిగా మోహన్ బాబు పలికించిన గంభీరమైన డైలాగులు, ఆయన పాత్రలో కనిపించిన క్రమశిక్షణ, క్లైమాక్స్ లో ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

పెదరాయుడు కథ విషయానికి వస్తే..

పెదరాయుడు ఒక గ్రామంలో పెద్దమనిషిగా, న్యాయానికి ప్రతిరూపంగా జీవిస్తుంటాడు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరకే వస్తారు. కుటుంబ వివాదాలైనా, ఆస్తి తగాదాలైనా, తప్పు చేసినవారికి శిక్ష విధించడమైనా ఆయన మాటే తుది తీర్పు. తన కుటుంబ సభ్యులు తప్పు చేసినా ఉపేక్షించకపోవడం ఆయన వ్యక్తిత్వం, అంతే కాదు ఆ పీటంపై ఎవరు కూర్చున్నా అదే కట్టుబాటుతో ఉంటారు.

పెదరాయుడి భార్య లక్ష్మి (భానుప్రియ) ఆయనను ఎంతో గౌరవిస్తుంది. తమ్ముళ్లు రాజా, రవీంద్ర కూడా ఆయన మాటను గౌరవిస్తూ పెరుగుతారు. అయితే రాజా (మోహన్ బాబు ద్విపాత్రాభినయంలోని యంగ్ క్యారెక్టర్ ) భారతి (సౌందర్య)ను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబంలో కొన్ని విభేదాలు మొదలవుతాయి. పెదరాయుడి కఠినమైన పద్ధతులు, రాజా అన్నకు ఇచ్చే గౌరవం భారతి మొదట్లో అర్థం చేసుకోలేకపోతుంది. కానీ క్రమంగా పెదరాయుడి గొప్పతనం ఆమెకు తెలుస్తుంది.

అయితే పెదరాయుడి మేనత్త కొడుకు ఈసినిమాక అసలు విలన్ అయిన భూపతి (ఆనంద్ రాజ్) పెదరాయుడి కుటుంబంపై పగతో రగిలిపోతుంటాడు. పెదరాయుడి కట్టుబాట్లను, నిజాయితీని దెబ్బతీయడానికి భూపతి ఒక కుట్ర పన్నుతాడు. ఊరికి వచ్చిన ఉపాధ్యాయిని (సుభాషిణి) సాయంతో రాజాపై నింద వేస్తాడు. నిజం తెలియని పెదరాయుడు తన సొంత తమ్ముడని కూడా చూడకుండా 10 సంవత్సరాల పాటు ఊరి నుండి వెలివేస్తూ తీర్పునిస్తాడు. చివరికి భూపతి కుట్ర బయటపడటం, తాను ఇచ్చిన తీర్పు తప్పని తెలుసుకున్న పెదరాయుడు పశ్చాత్తాపంతో కుంగిపోవడం, ఆ క్రమంలో ఆయన తండ్రి పాపారాయుడు (రజనీకాంత్) గతంలో భూపతి తండ్రికి ఇచ్చిన మాట, పెదరాయుడి త్యాగం చుట్టూ కథ మలుపులు తిరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నటీనటులు ఎలా చేశారాంటే?
Image Credit : Asianet News

నటీనటులు ఎలా చేశారాంటే?

పెదరాయుడిగా గాంభీర్యం, క్రమశిక్షణ, న్యాయబద్ధత కలిగిన పాత్రలో మోహన్ బాబు జీవించారు. ఆయన డైలాగ్ డెలివరీ, హావభావాలు, పీఠంపై కూర్చుని చెప్పే తీర్పులు థియేటర్లలో ఈలలు వేయించాయి. రాజసం ఉన్న పాత్రకు మోహన్ బాబు తప్ప మరెవరు చేయలేరు అన్నట్టుగా పెదరాయుడు పాత్ర నిండుగా కనిపించింది. యంగ్ క్యారెక్టర్ లో కూడా మోహన్ బాబు అద్భుతం చేశాడు. రాజా పాత్రలో ఫైట్లు, డ్యాన్సులు, రొమాన్స్ తో మెప్పించారు.

ఇక దాదాపు 20 నిమిషాల పాటు కనిపించే పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆయన ఎంట్రీతో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. రజనీకాంత్ నటన, బాడీ లాంగ్వేజ్‌కి తోడు సాయికుమార్ చెప్పిన డబ్బింగ్ ఆ పాత్రను వేరే లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్శణ ఇద్దరు హీరోయిన్లు. పెదరాయుడి భార్యగా భానుప్రియ తన సంప్రదాయబద్ధమైన నటనతో, గౌరవప్రదమైన లుక్‌తో ఆకట్టుకోగా, సౌందర్య తన గ్లామర్ , నటనతో మెప్పించింది.

విలన్‌గా భూపతి పాత్రలో ఆనంద్ రాజ్ క్రూరత్వాన్ని బాగా పండించారు. సెంటిమెంట్ పాత్రలో జయంతి అద్భుతంగా నటించగా.. ఇంత సీరియస్ గా సాగిపోయే సినిమాకు తమ కామెడీతో రిలాక్స్ కలిగేలా చేశారు. బ్రహ్మానందం, బాబు మోహన్, ఎం.ఎస్. నారాయణ, ముఖ్యంగా బ్రహ్మానందం, బాబు మోహన్ కాంబో సీన్స్ డియన్స్ ను ఎంతగానో నవ్వించాయి.

34
చిరంజీవిని కోలుకోలేని దెబ్బ కొట్టిన మోహన్ బాబు..
Image Credit : Asianet News

చిరంజీవిని కోలుకోలేని దెబ్బ కొట్టిన మోహన్ బాబు..

1995 జూన్ 15వ తేదీన తెలుగు సినీ చరిత్రలో ఒక పెద్ద బాక్సాఫీస్ సమరం జరిగింది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి విజయబావుటా ఎగురవేస్తున్న సమయంలో విజయ్ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘బిగ్ బాస్’, మరొకవైపు మోహన్ బాబు నటించిన ‘పెదరాయుడు’ ఒకే రోజున థియేటర్లలో విడుదలయ్యాయి. భారీ అంచనాలు - విపరీతమైన టాక్.. ‘ఘరానా మొగుడు’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత చిరంజీవి ‘బిగ్ బాస్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

అయితే.. పెదరాయుడు సినిమా ముందు బిగ్ బాస్ సినిమా తేలిపోయింది. రొటీన్ కథాంశం, ఆకట్టుకోని కథనంతో మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. మరోవైపు, బిగ్ బాస్ నెగటివ్ టాక్ తెచ్చుకోగా, ‘పెదరాయుడు’ మొదటి ఆట నుంచే ఇండస్ట్రీ హిట్ టాక్‌తో దూసుకెళ్ళింది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ పెదరాయుడు వైపే మొగ్గు చూపారు.

బిగ్ బాస్ డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో, ఆ థియేటర్లను కూడా పెదరాయుడు సినిమా కలెక్షన్ల సునామీ ఆక్రమించింది. ‘ఘరానా మొగుడు’ పేరిట ఉన్న రికార్డులను తిరగరాస్తూ పెదరాయుడు రూ. 12 కోట్ల షేర్ వసూలు చేసి ఆనాటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 40కి పైగా కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది.

44
ఫైనల్ గా పెదరాయుడు సినిమా గురించి..
Image Credit : Asianet News

ఫైనల్ గా పెదరాయుడు సినిమా గురించి..

ప్లస్ పాయింట్లు (Pluses):

మోహన్ బాబు - రజనీకాంత్ కాంబినేషన్: ఇద్దరు దిగ్గజ నటుల నటన, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలం.

రవిరాజా పినిశెట్టి దర్శకత్వం & డైలాగ్స్: ఎమోషన్స్, సెంటిమెంట్, డ్రామాను సరైన నిష్పత్తిలో తెరకెక్కించిన తీరు.

జి.సత్యమూర్తి రాసిన సంభాషణలు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి.

సంగీతం: కోటి (కోటేశ్వరరావు) అందించిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

సెంటిమెంట్ & కుటుంబ నేపథ్యం: గ్రామీణ వాతావరణం, అన్నదమ్ముల అనుబంధం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.

మైనస్ పాయింట్లు (Minuses):

రీమేక్ కావడంతో ఒరిజినల్ సినిమా చూసిన వారికి కొన్ని సీన్లు ఊహకందేలా ఉంటాయి.

సెకండ్ హాఫ్ సినిమాలో డ్రామా కొంచెం రొటీన్‌గా అనిపిస్తుంది.

పెదరాయుడు’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో.. కుటుంబ విలువల ఇంపార్టెన్స్ ను మరోసారి చాటిచెప్పిన మూవీ. న్యాయం, ధర్మం, కుటుంబ గౌరవం అనే అంశాలను మాస్ ఎలిమెంట్స్‌తో మేళవించి దర్శకుడు రవిరాజా పినిశెట్టి అద్భుతంగా మలిచారు. మోహన్ బాబు యాక్టింగ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఈ చిత్రం, దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ టీవీల్లో వస్తే ప్రేక్షకులు వదలకుండా చూసే క్లాసిక్ మాస్టర్‌పీస్. ఈమూవీ చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సినిమా సమీక్షలు
మంచు మోహన్ బాబు
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Devadasu Review: ఏఎన్నార్, కృష్ణల మధ్య పగను రగిలించిన సినిమా, దేవదాసు మూవీ రివ్యూ..
Recommended image2
Ranabaali Day 1 Collections: రణబాలికి షాకింగ్‌ కలెక్షన్లు.. విజయ్‌, రష్మిక మూవీకి మొదటి రోజు వచ్చింది ఇంతేనా?
Recommended image3
Garividi Lakshmi Movie Review: గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ, బుర్రకథ కళాకారిణి జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Warranty vs Guarantee: వారంటీ – గ్యారెంటీ మధ్య తేడా ఏంటి? వస్తువు కొన్నప్పుడు ఏది చూసుకోవాలి?
Recommended image2
Devadasu Review: ఏఎన్నార్, కృష్ణల మధ్య పగను రగిలించిన సినిమా, దేవదాసు మూవీ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved