MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ramayana Movie: రూ.4000 కోట్ల 'రామాయణం' అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.. వరల్డ్ వైడ్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?

Ramayana Movie: రూ.4000 కోట్ల 'రామాయణం' అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.. వరల్డ్ వైడ్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న 'రామాయణం' సినిమా 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు నుంచే మొదలయ్యాయి. వరల్డ్ వైడ్ గా రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 21 2026, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
4000 కోట్ల భారీ బడ్జెట్‌..
Image Credit : Asianet News

4000 కోట్ల భారీ బడ్జెట్‌..

రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి! ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రామాయణం రిలీజ్ ఎప్పుడంటే?
Image Credit : X

రామాయణం రిలీజ్ ఎప్పుడంటే?

2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ విజువల్ వండర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఐమ్యాక్స్‌తో పాటు పలు ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మన ఇండియన్ ఎపిక్‌ను గ్లోబల్ ఆడియన్స్‌కు గ్రాండ్‌గా పరిచయం చేసేందుకు మూవీ టీమ్ రెడీ అయింది.

ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ కలిసి 'రామాయణం' సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై అంచనాలు స్కై రేంజ్‌కు చేరుకున్నాయి.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌కు చెందిన నమిత్ మల్హోత్రా, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ 2026 నవంబర్ 5న రిలీజ్ అవుతుండగా.. సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రానుందని అంచనా. హిందీ, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.

33
మ్యూజిక్ గురించి హీరోల కామెంట్స్..
Image Credit : others

మ్యూజిక్ గురించి హీరోల కామెంట్స్..

'రామాయణం' మ్యూజిక్ గురించి మాట్లాడుతూ యశ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. స్కూల్, కాలేజ్ రోజుల్లో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఎన్నో పాటలకు తాను డ్యాన్స్ చేశానని యశ్ చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా 'చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే' పాట తనకెప్పటికీ గుర్తిండిపోతుందని యశ్ అన్నారు. కన్నడ ఇండస్ట్రీకి కూడా రెహమాన్ ఎంతో సేవ చేశారని, ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని యశ్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

భారీ స్టార్ కాస్ట్, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లతో వస్తున్న 'రామాయణం' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే మాత్రం రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pedarayudu Movie Review: చిరంజీవిని చావు దెబ్బకొట్టిన మోహన్ బాబు సినిమా, పెదరాయుడు రివ్యూ..
Recommended image2
Trigun: చివరి నిమిషంలో మళ్ళీ బుక్కైన అమన్.. ముకేశ్, వర్షిణి జాగ్రత్త.. సుధీర్ ని పాముతో పోల్చిన త్రిగుణ్
Recommended image3
వెంకీ, నితిన్, చైతూ సినిమాల దసరా పోస్టర్స్ ఇవిగో.. ఆదర్శ కుటుంబం, ఎల్లమ్మ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్
Related Stories
Recommended image1
కూర్చుని కాళ్లు ఊపితే దరిద్రం చుట్టుకుంటుందా? పెద్దలు చెప్పింది ఎంత వరకు నిజం?
Recommended image2
Pedarayudu Movie Review: చిరంజీవిని చావు దెబ్బకొట్టిన మోహన్ బాబు సినిమా, పెదరాయుడు రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved