Asianet News TeluguAsianet News Telugu

గోపీచంద్ సంపత్ నంది ల గౌతమ్ నంద ఫస్ట్ లుక్

  • సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్‌ కథానాయకుడిగా మూవీ
  • గౌతమ్ నంద టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
gowtham nanda

సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్‌ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ చిత్రానికి ‘గౌతమ్‌ నంద’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో గోపీచంద్‌ మునుపెన్నడూలేని గెటప్‌లో చాలా స్టైలిష్‌, రిచ్‌గా కనిపించారు. ఆయన పక్కన ఓ హెలికాప్టర్‌, చుట్టూ పెద్దపెద్ద భవనాలు ఉన్నాయి. ఈ ఫస్ట్‌లుక్‌ను సంపత్‌ నంది తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘గౌతమ్‌ నందను పరిచయం చేసుకోండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.

శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్‌, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios