గవర్నర్ నరసింహన్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని సతీసమేతంగా చూసారు . 9 ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో గవర్నర్ దంపతులు కూడా ఆసక్తిగా ఆ చిత్రాన్ని తిలకించారు . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రాన్ని చూడగా గవర్నర్ దంపతులతో పాటు చిరు కుటుంబం కూడా మరోసారి ఈ చిత్రాన్ని వీక్షించారు . సినిమా చూసిన అనంతరం గవర్నర్ నరసింహన్ చిరంజీవి నటన గురించి పదే పదే పొగిడాడట .

పైగా సినిమా ఇతివృత్తం కూడా రైతు సమస్యల పై ఉంది కాబట్టి చాలాబాగుందని కితాబు నిచ్చాడట గవర్నర్ . చరణ్ నిర్మించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం రికార్డులను బద్దలు కొడుతూ తెలుగు టాప్ గ్రాసర్ లలో ఒకటిగా నిలబడుతుంది . ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ల ని కొల్లగొడుతున్న ఈ చిత్రం చిరంజీవి కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ అనే చెప్పాలి .