నందమూరి బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గౌతమీపుత్ర శాతకర్ణి రూ.77 కోట్లు షేర్ మార్కును టచ్ చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి గురువారంతో శాతకర్ణి 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోనుంది
ఇది చాలా పెద్ద రిస్కే అన్నారు. ఐతే కమర్షియల్ గా వర్కవుటవుతుందో లేదో చూసుకోకుండా సాహసం చేయడానికి క్రిష్ ఏం అంత తెలివి తక్కువ వాడు కాదు కదా. ఈ చిత్రం ఇప్పుడు క్లోజింగ్ లో రికవర్ చేసిన మొత్తం ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ తింటారు.థియేట్రికల్ కలెక్షన్లతో పాటు డిజిటల్ రైట్స్.. శాటిలైట్.. ఆడియో.. డీవీడీ.. డిజిటల్.. ఇతరత్రా హక్కులన్నీ కలిపితే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూ.77 కోట్లు వసూలు చేసిందని అంచనా. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన సంగతి తెలిసిందే.
మొదట ఈ చిత్ర బడ్జెట్ రూ.70 కోట్లన్నారు కానీ.. రూ.55 కోట్లకు అటు ఇటుగా ఖర్చయినట్లు సమాచారం. ఆ రకంగా చూస్తే నిర్మాతలకు కనీసం రూ.20 కోట్ల లాభం వచ్చిందన్నమాట. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు వినోద పన్ను మినహాయింపు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రకంగా కూడా నిర్మాతలకు అదనపు లాభం వచ్చినట్లే. గురువారంతో ‘శాతకర్ణి’ 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు తొలిసారిగా ఈ చిత్ర వసూళ్ల వివరాలు మీడియాతో పంచుకున్నారు
