Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ వాయిదా.. గోపీచంద్ ఆక్సిజన్ కొత్త రిలీజ్ తేది అక్టోబర్ 27

  • గోపీచంద్ తదుపరి చిత్రం 'ఆక్సిజన్' ఇప్పటికే పలుమార్లు వాయిదా
  • తాజాగా మళ్లీ రిలీజ్ డేట్ మార్చేసి అక్టోబర్ 27న అంటూ ప్రకటన
  •  కథానాయికలుగా రాశి ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్       
gopichand oxygen postponed again to october 27

గోపీచంద్ హీరోగా జ్యోతికృష్ణ  దర్శకత్వంలో 'ఆక్సిజన్' చిత్రం తెరకెక్కింది. ఐశ్వర్య నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 'గౌతమ్ నందా' కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది.
 

అక్టోబర్ 12 న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా చెప్పారు .. ఆ తరువాత అక్టోబర్ 17కి వెళ్లారు. ఇక ఇప్పుడు అక్టోబర్ 27ను విడుదల తేదీగా ఫిక్స్ చేశారనేది తాజా సమాచారం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం గోపీచంద్ అభిమానులంతా కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీలను పదే పదే మారుస్తూ ఉండటమే వాళ్లకి అసహనాన్ని కలిగిస్తోంది. ఇలా విడుదల తేదీలను పదేపదే మార్చడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios