గోపీచంద్ మార్కెట్ ఇంతగా పడిపోయిందా..

First Published 1, Dec 2017, 8:14 PM IST
gopichand market missing in recent times
Highlights
  • గోపీచంద్ మార్కెట్ పరేషాన్
  • ఆక్సిజన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ టోటల్ డల్
  • గోపీచంద్ హిట్టు కొట్టి మూడేళ్లు

గోపీచంద్ హిట్టు కొట్టి మూడేళ్లయింది. లౌక్యం సినిమాతో  హిట్ కొట్టిన గోపీకి ఆ త‌ర్వాత వ‌రుసగా సినిమాలు ప్లాపుల మీద ప్లాపులు అవుతున్నాయి. ప్ర‌స్తుతం గోపీ సినిమాల‌కు త‌న రేంజ్‌కు త‌గ్గ‌ట్టుగా మార్కెట్ కూడా అవ్వ‌డం లేదు. ఈ యేడాది గోపీ న‌టించిన గౌత‌మ్‌నందా సినిమా రూ.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో రిలీజ్ అయ్యి, రూ.10 కోట్లు మాత్ర‌మే కొల్ల‌గొట్టింది.

 

తాజాగా గోపీ న‌టించిన ఆక్సిజ‌న్ సినిమా నిన్న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. సినిమాకు అటు ప్రేక్ష‌కుల నుంచి ఇటు రివ్యూవ‌ర్ల నుంచి బ్యాడ్ టాక్ రావ‌డంతో ఆక్సిజ‌న్ తొలి రోజే బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. సినిమాకు మౌత్ టాక్ అస‌లే లేద‌నుకుంటే, రివ్యూవ‌ర్లే ఏకిప‌డేయ‌డంతో సినిమాపై కాస్తో కూస్తో ఉన్న క్రేజ్ కూడా పోయింది.

 

ఇక ఈ సినిమాకు తొలి రోజు 1.59 కోట్ల షేర్ మాత్ర‌మే రాబ‌ట్టింది.ఈ సినిమాకు రూ.25 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కితే, రూ. 13 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. గోపీ చివ‌రి సినిమా గౌత‌మ్‌నందా తొలి రోజు రాబ‌ట్టిన రూ 3.26 కోట్ల షేర్ కంటే ఇది చాలా త‌క్కువ‌. ఇక ఆక్సిజ‌న్ ఘోరాతి ఘోర‌మైన వ‌సూళ్లు చూస్తే గోపీ కెరీర్‌లో మ‌రో డిజాస్ట‌ర్ ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ సినిమా ఏరియా వైజ్‌గా రాబ‌ట్టిన వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

 

నైజాం - 49 (రూ. ల‌క్ష‌ల్లో)

సీడెడ్ - 26

గుంటూరు - 29

ఉత్త‌రాంధ్ర  - 20

గుంటూరు - 11

వెస్ట్ - 10

కృష్ణా - 9

నెల్లూరు - 5

---------------------------------

ఏపీ+తెలంగాణ = 1.59 కోట్లు

loader