గోవాకు చెందిన ది ఉమెన్స్ వింగ్ ఆఫ్ గోవా ఫార్వర్డ్ పార్టీ పూనమ్ మరియు కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకొనేలా ఎస్పీ కి రాతపూర్వకంగా పిర్యాదు చేశారు. గోవా లోని చంపోలి డ్యామ్ వద్ద పోర్న్ వీడియో షూట్ చేసిన కారణంగా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. గోవా సాంస్కృతిక సంపదగా భావించే, ప్రభుత్వ పర్యాటక ప్రదేశంలో పోర్న్ వీడియో షూట్ చేయడం తమకు దిగ్బ్రాంతికి గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. 

గోవా మరియు ఈప్రాంత మహిళల ఇమేజ్ ని దెబ్బతీసే సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ షూటింగ్ కి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు, అధికారులను కూడా శిక్షించాలని వారు కోరడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పూనమ్ పై కేసు బుక్ చేసినట్లు తెలుస్తుంది. 

ఈ వీడియో షూటింగ్ కోసం గోవా వెళ్లిన పూనమ్ భర్త సామ్ బాంబే పై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. దీనితో గోవా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ పై బయటికి వచ్చిన సామ్ బాంబే, పూనమ్ కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ మరలా కలిసి కాపురం చేస్తున్నారు. హనీ మూన్ కోసం అమెరికా వెళ్లిన ఈ జంట ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనానికి తెరలేపారు.