Asianet News TeluguAsianet News Telugu

జార్జిరెడ్డి రేపు మళ్ళీ పుడుతున్నాడు.. సమాధి వద్ద డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్!

ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ చిత్రాల సందడి ఉంటుంది. ఈ శుక్రవారం కూడా కొన్ని మీడియం రేంజ్ చిత్రాలు, చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. జార్జిరెడ్డి చిత్ర యువతని ప్రధానంగా ఆకర్షిస్తోంది.

George reddy director Jeevan Reddy emotional comments
Author
Hyderabad, First Published Nov 21, 2019, 12:52 PM IST

ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ చిత్రాల సందడి ఉంటుంది. ఈ శుక్రవారం కూడా కొన్ని మీడియం రేంజ్ చిత్రాలు, చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. జార్జిరెడ్డి చిత్ర యువతని ప్రధానంగా ఆకర్షిస్తోంది. 1960 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 

జార్జిరెడ్డి ప్రచార చిత్రాలకు విశేష స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం రోజు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి, ఇతర చిత్ర బృందం నారాయణగూడలోని జార్జిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. 

జార్జిరెడ్డి హత్య.. అంతకుముందు నాతోనే ఉన్నాడు: తమ్మారెడ్డి

ఈ సందర్భంగా జార్జి రెడ్డి గురించి మాట్లాడుతూ దర్శకుడు జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. జార్జిరెడ్డి చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ధ్యేయం అని జీవన్ రెడ్డి అన్నారు. జార్జిరెడ్డి స్ఫూర్తిని తెలియజేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీ కోసం ఐదేళ్లు కష్టపడ్డా. జార్జిరెడ్డి అంటే నీతి, నిజాయతి. సినిమాలో కూడా అలాగే చూపించా. 

జార్జిరెడ్డి చిత్రం రేపు విడుదలవుతోంది.అంటే ఆయనే మళ్ళీ పుడుతున్నారు అని జీవన్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక జార్జిరెడ్డిపై కొందరు చేస్తున్న విమర్శలని తాను పట్టించుకోనని అన్నారు. జార్జిరెడ్డి మీది ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చు అని జీవన్ రెడ్డి అన్నారు. 

జార్జిరెడ్డి పాత్రలో నటించిన యువ నటుడు సందీప్ మాధవ్ మాట్లాడారు. జార్జిరెడ్డి గురించి తెలుసుకుని తాను ఆశ్చర్యపోయినట్లు సందీప్ తెలిపారు. అంత మంచి వ్యక్తిని ఎందుకు చంపేశారు అనే సందేహం నాకు కలిగింది. విద్యార్థుల హక్కుల కోసం పోరాడడమే ఆయన చేసిన తప్పా అని సందీప్ అన్నారు. ఇక కేవలం ట్రైలర్ చూసి సినిమా మొత్తం వివాదంగా ఉంటుందని అనుకోవద్దని సూచించారు. 

మా సంఘాల జోలికొస్తే అడ్డుకుంటాం: జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు

జార్జిరెడ్డి చిత్రానికి జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ హాజరుకావాల్సి ఉండగా.. పోలీసులు సెక్యూటిరీ కారణాలవల్ల ఈవెంట్ ని రద్దు చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రానికి సపోర్ట్ చేశారు. మెగాస్టార్ చేతుల మీదుగా ఈ చిత్రంలోని ఓ సాంగ్ లాంచ్ అయింది. మొత్తంగా శుక్రవారం జార్జిరెడ్డి చిత్రం విడుదల కానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios