టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సినిమా జార్జి రెడ్డి. గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబందించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెయిన్ గా జార్జిరెడ్డి వ్యక్తిత్వంపై పలువురు ఆరోపణలు చేయడం వైరల్ అవుతోంది. ఇక అప్పట్లో ఆయనతో కలిసి చదువుకున్న ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపారు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ.. జార్జి రెడ్డి నిజంగానే రియల్ హీరో హత్య రోజు 1:30కి మేం కలిసే ఉన్నాం.. జార్జిరెడ్డిని లైబ్రరీ లో దింపి నేను లంచ్ కి వెళ్ళా.. అతడిని ఎవరు చంపారో ఇప్పటికీ మిస్టరీ గా నే ఉంది..  అతడిని మరోసారి గుర్తు చేసిన ఏబీవీపీకి ధన్యవాదాలు.. ఏబీవీపీ కర్రలతో దాడులు చేస్తే.. జార్జి నకల్ డస్టర్ లతో దాడి చేశారు.అన్యాయాన్ని ఎదిరించిన వ్యక్తి జార్జి. ఎంతో మందికి స్పూర్తినిచ్చిన నాయకుడు సినిమాని సినిమాగానే చూడాలి" అని ఆయన వివరణ ఇచ్చారు.

Also Read: మా సంఘాల జోలికొస్తే అడ్డుకుంటాం: జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు

ఇక జార్జి రెడ్డి సినిమా శుక్రవారం భారి స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ దక్కడం కాయమని చెప్పవచ్చు. అలాగే చిత్ర యూనిట్ కి స్పెషల్ విషెస్ అందించారు. ఇకపోతే ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేసుకున్నప్పటికీ చివరి నిమిషంలో చిత్ర యూనిట్ క్యాన్సిల్ చేయక తప్పలేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా ఈవెంట్ లోపాల్గొనాల్సి ఉండగా పోలీసులు అనుమతికి నిరాకరించినట్లు తెలుస్తోంది.