సావిత్రి నాన్న మీదకు కుక్కను వదిలి గెంటించింది: జెమినీ గనేషన్ కూతురు

gemini ganeshan daughter kamala selvaraj fires on mahanati movie
Highlights

'మహానటి' సావిత్రి సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది

'మహానటి' సావిత్రి సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తునే ఉన్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వివాదాలు చోటుచేసుకోలేదు. తాజాగా జెమినీ గనేషన్ కూతురు ఈ సినిమాలో తన తండ్రిని తక్కువ చేసి చూపించారంటూ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సినిమాలో జెమినీ గనేషన్.. సావిత్రికి మందు అలవాటు చేసినట్లు చూపించారు.

ఈ విషయాలపై స్పందించిన జెమినీ గనేషన్ కూతురు కమలా సెల్వరాజ్ ''తమిళ సినీ పరిశ్రమలో ఎంజిఆర్, శివాజీ గనేషన్ లతో పాటు మా తండ్రి జెమినీ గనేషన్ కూడా అగ్రహీరో అనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు.. అలాంటిది అతడి పాత్రను తక్కువ చేసి చూపించారు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమినీ గనేషన్ అన్నట్లుగా సినిమాలో చూపించారు. ఈ విషయం నన్ను చాలా బాధ పెట్టింది. మా నాన్న గారు సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సావిత్రిని కలిసి 'ప్రాప్తం' చిత్ర నిర్మాణంలో తన నిర్ణయాన్ని మర్చుకోమని తన ఇంటికి వెళ్లి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నేను కూడా నాన్న వెంటే ఉన్నాను. కానీ సావిత్రి మా మీదకు కుక్కను వదిలి  బయటకు గెంటించింది. ఆ సమయంలో కుక్క బారి నుండి తప్పించుకోవడానికి గోడ దూకి పారిపోవాల్సివచ్చింది. అప్పటినుండి ఆమె ఇంటికి వెళ్ళడం కూడా మానేశాం'' అని స్పష్టం చేశారు.

ఓ తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా మహానటి సినిమాను తప్పుబట్టారు. మరి ఈ విషయంపై అటు సావిత్రి కూతురు గానీ, మహానటి చిత్రబృందం గానీ  స్పందిస్తుందేమో చూడాలి!

loader