సావిత్రికి కోపం తెప్పించిన టెలిగ్రామ్.. ఇంతకీ అందులో ఏముందంటే!

సావిత్రికి కోపం తెప్పించిన టెలిగ్రామ్.. ఇంతకీ అందులో ఏముందంటే!

సావిత్రి జీవిత చరిత్రతో మహానటి సినిమా వచ్చిన తరువాత ఆమె జీవితంలో జరిగిన మరిన్ని సంఘటనలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా స్టార్ స్టేటస్ అనుభవిస్తూ సొసైటీలో పేరుండే వారికి కాస్తో కూస్తో గర్వం, కోపం ఆటోమేటిక్ గా వస్తుంటాయి. కానీ సావిత్రికి కోపం ఉన్నట్లు గానీ, పొగరుగా ప్రవర్తించిన సందర్భాలు కానీ సినిమాలో ఎక్కడా చూపించలేదు. 

నిజానికి సావిత్రి గారిదే అందరితో కలిసిపోయే మనస్తత్వమే.. ఆమెకు కోపం కూడా రాదట. కానీ ఒకేఒక్కసారి ఆమెకు పట్టరాని కోపం వచ్చిందట. ఆ సంఘటన ఏంటో చూద్దాం. 'పాపమనిప్పు' అనే సినిమా వంద రోజుల వేడుక కోసం సావిత్రి, జెమినీ గనేషన్ తో కలిసి బెంగుళూరుకి వెళ్లారట. అక్కడ ఓ స్టార్ హోటల్ లో వీరిద్దరూ బస చేశారు. ఈవెంట్ కోసం థియేటర్ కు వెళ్ళగా.. హోటల్ నుండి జెమినీ గనేషన్ కు ఫోన్ వచ్చిందట. యాజమాన్యం అతడికి టెలిగ్రామ్ వచ్చిందని చెప్పగా అందులో ఏముందో ఆయన చదవమని అడిగారట.

సావిత్రి కూతూరు విజయ ఛాముండేశ్వరి చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చిందని వారు చెప్పగా, పరుగున హోటల్ కు చేరుకొని వెంటనే మద్రాస్ కు ఫోన్ చేసి కనుక్కోగా ఆమె క్షేమంగా ఉందని తెలుసుకున్నారు. ఈ విషయం మొత్తం సావిత్రికి వివరించగా ఆమె పట్టరాని కోపంతో ఆ టెలిగ్రామ్ ఎవరు చేశారో కనుక్కోవాలని ప్రయత్నించిందట. కానీ చివరి వరకు ఆ టెలిగ్రామ్ ఎవరు పంపారో తెలుసుకోలేకపోయారని సమాచారం. గతంలో ఓ ఇంటర్వ్యూలో జెమినీ గనేషన్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. అంత కోపంతో సావిత్రిని ఎప్పుడూ చూడలేదని ఆయన స్పష్టం చేశారు. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page