Asianet News TeluguAsianet News Telugu

బూతు మీద నాకు చాలా రెస్పెక్ట్.. కిక్ యాస్ ఫ్రెండ్స్ వున్నారు-గాయత్రి

  • ఫిదాతో మంచి గుర్తింపు పొందిన గాయత్రి గుప్తా
  • తాజాగా ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన  గాయత్రి గుప్తా
  • తనకు బూతంటే చాలా రెస్పెక్ట్ అని స్టేట్ మెంట్ ఇచ్చిన గాయత్రి

 

gayatri guptha tells she respect abusive language

ఇటీవల తన బోల్డ్ స్టేట్ మెంట్స్ తో సోషల్ మీడియాలో పాపులారిటీతో పాటు ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి గాయత్రి గుప్తా. తనను చూస్తేనే.. ఈ అమ్మాయి కొంచెం తేడా అన్నట్లుగా కనిపిస్తుంది. తనెంత బోల్డ్ గా ఎలా తయారైందో వివరిస్తూ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మాట్లాడేసింది. అసలు బూతు వల్లే తాను సంతోషంగా వున్నానని గాయత్రి అంటోంది. ఇంతకీ గాయత్రి లైఫ్ లో బూతుకున్న ప్రాధాన్యత ఏంటి.? తన మాటల్లోనే...

 

“అసలు బట్టలు తక్కువేసుకుంటేనే బోల్డ్ కాదు. మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే దాన్నిబట్టే ఏదైనా వుంటుంది. ఇన్నేళ్లుగా నేను డైరెక్టర్ అవాలనే పరిశ్రమకు వచ్చాను. అదే నాకు ఇష్టం. నేను ఫేమస్ అవటానికి ఇండస్ట్రీకి రాలేదు. నేనోదో క్యాజువల్ గా మాట్లాడుతుంటే అందరూ ఎట్రాక్ట్ అవుతున్నారు. అంతా నువు బిందాస్ వున్నవు అని చెప్తున్నారు. నా యాటిట్యూడ్ కి అంతా ఫ్యాన్స్ అయారు. నేను సెక్సీగా వున్నానని, ముఖం అందంగా వుందని మెచ్చేకంటే.. నా పర్సనాలిటీని చూసి అభిమానించే వాళ్లంటేనే నాకిష్టం. అదే సరైంది. నన్ను నన్నుగా అభిమానించే వాళ్లున్నందుకు సంతోషంగా వుందని గాయత్రి అంది.

 

మనం మాట్లాడింది ఒకటైతే... రాసే వాళ్లు మరోలా రాస్తున్నారు. రేప్ అటాక్ జరిగిందని నేను చెప్తే.. జరిగిందంట అని రాశారు. ఇంత రచ్చ చేస్తున్నారేంటని ఫీలయ్యా. పోనీ సైలెంట్ అయిపోదామా అంటే... ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. అందుకే మాట్లాడుతున్నా.

 

డబుల్ స్టాండర్డ్ సొసైటీ మనది. చేసేదంతా చేసుకుంటూ.. పతివ్రతలా తయారై నీతులు చెప్తారు. కానీ నాలాంటి వాళ్లను తేడా వుందేంటి అంటారు. కానీ నేను ఎలా కనిపిస్తానో అలానే వుంటాను. నేను ఓపెన్ బుక్ లాంటిదాన్ని. సొసైటీలో అందరూ నాలాంటి వాళ్లను అంగీకరించాలి. అదెలా చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను.

 

నాకు మాత్రమే తెలిసిన విషయాన్ని పరువు పోతుందని తెలిసినా పబ్లిక్ గా చేయటానికి ప్రత్యేక కారణం ఏంలేదు. మనకు దెబ్బలు తగిలినప్పుడు మనల్ని బాధపెట్టిన వాళ్ల గురించి మాట్లాడకుంటే.. ఇదేం పీకలేదు కాబట్టి మనం ఇంకొకరిని కూడా హర్ట్ చేయచ్చు అనుకుంటారు. అలాంటి వాళ్లను చూసి భయపడకూడదు.

నేను ఒకరి గురించి బైటపెడితే.. మరొకరు తప్పించుకోవచ్చు. ఫైర్ ను ఫైర్ చేస్తే... బూడిద మిగులుతది. నేను ఇలా చెప్తే.. రియలైజ్ అవుతారనే చెప్తున్నా. భయపడిత వేస్ట్ అని మా అమ్మ చెప్పింది. సభ్య సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు.

 

బూతులు తప్పని మీరు డిసైడ్ చేయలేరు.. ఏది తప్పు ఏది ఒప్పు అని మనమెలా డిసైడ్ చేస్తాం. టీవీలు, మన చుట్టూ వున్నది యు సర్టిఫికెట్ సభ్య సమాజం అనుకుందాం. ఇంటర్నెట్ , యూ ట్యూబ్ లో సర్టిఫికేషన్ లేదు. అది అసభ్య సమాజం అనుకోండి. దాన్ని నేను వాడుకుంటున్నా..నాకు అది ఫ్రీడమ్ ఇచ్చింది. నన్ను జనం నన్నుగా అంగీకరిస్తేనే నాకిష్టం. నా బాడీ ఎలా వుంది అనేది పక్కనపెడితే.. నా యాటిట్యూడ్ ను ఇష్టపడే కిక్ యాస్ ఫ్రెండ్స్ నాకున్నారు. అసలు నాకు అబ్బాయిలే ఎక్కువ ఫ్రెండ్స్ వున్నారు.

 

నేను చాలా సెన్సిటివ్. వ్యంగ్యంగా ఎవరన్నా మాట్లాడితే... తిరిగి అలాగే స్పందిస్తా. నా ఫ్రెండ్స్ కు కూడా అదే చెప్తున్నా. నన్ను చాలా మంది అభిమానిస్తున్నారు. నా పర్సనాలిటీకి ఫ్యాన్స్ వున్నారు. అందుకే బూతు మీద నాకు అంత రెస్పెక్ట్. నాకు ఐడెంటిటి దాహం లేదు. నాకు చేసే పని మాత్రమే ఇష్టం.

 

ఒకతను నన్ను డామినేట్ చేసే సందర్భంలో.. ఎమోషనల్ గా డిప్రెస్ కావటం మానేసి బూతులు మాట్లాడితే... సైలెంట్ అయిపోయాడు. అప్పుడే బూతులు మాట్లాడితే నన్ను నేను సేవ్ చేసుకోవచ్చని అర్థం చేసుకున్నా. బూతు అంటే అదేం చెడ్డ విషయం కాదని నేను పీలవుతాను. అసలు మనం మన బాడీ పార్ట్స్ ను పెట్టి బూతులు తిడతాం. నా డ్యాష్ డ్యాష్, నీ డ్యాష్ డ్యాష్ అని... అవి అంత కానివే అయితే మన బాడీలో ఎందుకుంచుకుంటున్నాం. అందుకే బూతు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ బూతు. అవి బూతులు కాదు. నన్ను కాపాడే పవిత్రమైన తూటాలు అని చెప్పుకొచ్చింది గాయత్రి. బూతులు మాట్లాడటం వల్ల మంచి జరిగింది. నన్ను గెలికే వాళ్లు తగ్గారని చెప్పింది గాయత్రి.

 

మనం టోటల్ గా బ్రోక్ అయిపోయిన టైమ్ లో.. ఎవరూ సపోర్ట్ చేసి రెస్పాన్సిబులిటీ తీసుకునే వాళ్లుండరు. నేను స్ట్రెయిట్ గా మాట్లాడుతా. బూతులు మాత్రమే కాదు. అందుకే నన్ను కొందరు తమ ఫ్యామిలీలకు పరిచయం చేసే ధైర్యం చేయరు. ఇప్పుడు లేడీ అర్జున్ రెడ్డి అనేపేరు పెట్టారు. కానీ నేను డిప్రెషన్ లో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించా. పైగా పీరియడ్స్ వచ్చినయ్. అప్పుడు నాకు ఎవరన్నా అవసరం అనిపించింది. కానీ ఎవరు స్పందించకపోవటంతో... నాకు విరక్తి కలిగింది. వీళ్ల గురించా నేను ఫీలవుతున్నదని అనుకున్నా. అప్పుడే నా యాటిట్యూడ్ మారింది. నాలాంటి అమ్మాయిని పెళ్లిచేసుకోవాలంటే ధైర్యం వుండాలన్న మాట నిజం. ఎవరన్నా దొరక్కపోతారా కానీ  పిల్లలు, పెళ్లికి నేను రెడీ కాలేదు అంది గాయత్రి. అంతకు పిల్లలు కావాలంటే... దత్తత తీసుకుంటా.

 

నేను పెరిగిందంతా దేవున్ని పూజిస్తూ..వేదాలు, హోమాల మధ్య పెరిగిన నేను, వివేకానందుని పాఠాలు చదివిన నేను.. సమ్మర్ క్యాంప్స్ లో దేవుడు క్షమిస్తాడని తెలుసుకున్నా. లైఫ్ లో చాలా ఎదుర్కొన్నా కూడా క్షమించే గుణం వల్లే ఈ స్థాయికి వచ్చాను. దేవున్ని నమ్మాలి. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా వున్నా. పాపులారిటీ కోసమే చేస్తున్నానంటే అది ఎప్పుడో పదేళ్ల క్రితమే చేసే దాన్ని అంటూ తన మనోగతం వివరించింది గాయత్రి.

Follow Us:
Download App:
  • android
  • ios