బాలీవుడ్ ను ఏలుతున్న బాద్ షా షారుఖ్ ఖాన్ ను ఇంట్లో గట్టిగా కంట్రోల్ చేస్తోందట సతీమణి గౌరీ ఖాన్. ప్రస్తుతం వైరల్ అవుతున్నా ఈ వార్తలో నిజం ఎంత..? ఆమె ఏ విషయంలో షారుఖ్ కు కు స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుందో తెలుసా..?  

షారుఖ్ ఖాన్ -గౌరీ ఖాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్. దాదాపు 33ఏళ్ళుగా అన్యోన్య దంపతులుగాపేరు తెచ్చుకున్నారు. అంతే కాదు..సినిమా. వ్యాపారం, కుటుంబం అన్నింటిని సరిగ్గా బ్యాలన్స్ చేస్తూ.. వాటిని ఎంతో ఇష్టంగా కోనసాగిస్తున్న జంటలలో ఒకరు అయితే బాలీవుడ్ లో బాద్ షాగా కొనసాగుతున్న షారుక్‌కి ఇంట్లో గౌరీ ఖాన్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారట. అయితే ఆమె అతనికి ఎలాంటి రూల్‌ పెట్టారో తెలుసా ? గౌరీ మరియు షారూఖ్ ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే..? 

గౌరీ ఖాన్ మాట్లాడుతూ... షారుఖ్ ఖాన్ బయట ఏదైనా తినాలన్నా.. లేదా ఏదైనా రెస్టారెంట్ కు వెళ్ళాలన్నీ అది నేను డిజైన్ చేసిన రెస్టారెంట్ కి మాత్రమే వెళ్ళాలి అని రూల్ పెట్టార గౌరీ ఖాన్. షారుఖ్ ఖాన్ సతీమణి ప్రోఫిషినల్ ఇంటీరియల్ డిజైనర్ అన్న విషయం తెలిసిందే. ఆమె ముంబయ్ లో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లకు పనిచేశారు. అంతే కాదు కొన్ని వందల రెస్టారెంట్లకు ఇంటీరియల్ డిజైన్ చేశారు గౌరీ ఖాన్. తాజాగా ముంబైలోని బాంద్రా శివారులో ఒక మెక్సికన్ రెస్టారెంట్‌ని డిజైన్ చేసారు గౌరీ ఖాన్. అంతే కాదు ..జంటగా ఈరెస్టారెంట్ ప్రారంభోత్సవానికి కూడా వెళ్ళారు. ఈసందర్భంగా ఈవెంట్‌లో గౌరీ షారూఖ్‌ను రెస్టారెంట్ నుండి తనకు ఇష్టమైన భాగం ఏది అని కూడా అడిగాడు మరియు అతను వెంటనే ఐ లైక్ యు....అని బదులిచ్చాడు. 

Sharukh Khan కు కలిసొచ్చిన సెంటిమెంట్, మరోసారి వైష్లోదేవిని దర్శించుకున్న బాలీవుడ్ బాద్ షా

ఇక గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్ గా పెద్ద ప్రాజెక్ట్ లు చాలా చేశారు. ఆమె బాలీవుడ్ నుంచి చాలా మంది సెలబ్రిటీల ఇళ్ళకు పనిచేశారు. అనన్య పాండే, షేన్ , ఫల్గుణి పీకాక్, రణబీర్ కపూర్ , అలియా భట్ మొదలైన ప్రముఖుల ఇళ్లకు, వ్యాపార సంస్థల కట్టడాలకు ఆమె ఇంటీరియల్ ను అద్భుతంగా నిర్మించారు. ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే.. చాలా కాలం గ్యాప్ తీసుకున్న షారుఖు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన పఠాన్, జవాన్ సినిమాలు చెరో వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. ప్రస్తుతం ఆయన మూడవ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. డుంకీ సినిమాతో ఫ్యాన్న్ ను పలుకరించబోతున్నాడు. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఈనెల అనగా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.