ఈమధ్య ఆధ్యాత్మిక యాత్రలు ఎక్కువగా చేస్తున్నాడు  బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్. కలిసొచ్చిందో.. లేక కావాలని చేస్తున్నాడో తెలియదు కాని... ఎక్కువగా ఈమధ్య దైవదర్శనాలు చేస్తున్నాడు.  

చాలా కాలం గ్యాప్ తరువాత వరుస హిట్లతో సంచలనంగా మారాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. పడిపోయిన బాలీవుడ్ ను పైకి లేపాడు. ఈక్రమంలో ఆయన రెండు సినిమాలు.. రెండు వేల కోట్ల కలెక్షన్స్ తో రీల్ హీరో కాస్తా.. రియల్ హీరోగామారాడు. ఇక ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హ్యాట్రీక్ హిట్ పై కన్నేశాడు. అది కూడా వెయ్యి కోట్ల టార్గెట్ ను దాటి.. దూసుకుపోవాలని చూస్తున్నాడు. అందులో బాగంగా డంకీ సినిమాతో త్వరలో థియేటర్లను పలుకరించబోతున్నాడు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ఓ సెంటిమెంట్ ను గట్టిగా ఫాలోఅవుతున్నాడు. ఇప్పటి వరకూ రెండు సినిమాలకు ఫాలో అయిన ఆ సూపర్ హిట్ ఫార్ములా సెంటిమెంట్ ను..ముచ్చటగా మూడో సారి కూడా రిపిట్ చేయబోతున్నాడు. 

పటాన్, జవాన్ లతో.. ఈ ఏడాది రెండు సూపర్‌డూపర్‌ హిట్ సినిమాలను అందించిన బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న డంకీ సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో మూవీ టీమ్ బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా షారుక్‌ ఖాన్‌ జమ్ములోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. తనకు విజయాన్ని ప్రసాదించమని వేడుకున్నారు. 

ఈరోజు (మంగళవారం) ఉదయం జమ్మూలోని కత్రా దగ్గరకు చేరుకున్నారు షారుక్‌ ఖాన్‌. అయితే ఇక్కడే షారుఖ్ సెంటిమెంట్ అందరికి అర్ధం అవుతుంది. ఆయన ఈ ఏడాదిలో మూడవసారి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది షారుక్‌ఖాన్‌ రెండు బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను అందించాడు. ఈ ఏడాది ఆరంభంలో పఠాన్‌ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో అవలీలగా చేరింది. ఆ తర్వాత జవాన్‌ సినిమాతో కూడా మరో డూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఈ రెండు సినిమాల విడుదలకు ముందు కూడా ఆయన వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. 

ఫ్యాన్స్ ను ఆశపెట్టి.. 2023 లో వెండితెరకు హ్యాండ్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలు

వైష్ణోదేవికి మొక్కుకున్నాకనే..ఆయనకు బాగా కలిసి వచ్చింది. పఠాన్‌' విడుదలకు ముందు 2022 డిసెంబర్‌ 12న వైష్ణోదేవి గుడికి వెళ్లిన షారుక్‌ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఇక జవాన్‌ విడుదలకు ముందు కూడా అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఇప్పుడు అదే సెంటిమెంట్ ను మళ్లీ రిపిట్ చేశారు షారుఖ్ . డంకీ విడుదల సమయంలో అక్కడ పూజలు నిర్వహించారు. అలా వైష్ణోదేవి అమ్మవారి సెంటిమెంట్‌ను షారుక్‌ పాటిస్తున్నారు.అమ్మవారి ఆలయం చుట్టూ షారుక్‌ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు పలువురు వీడియోలు తీశారు. షారుక్‌తో పాటు తన అంగరక్షకులు, మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. 

ఇక తను నటించిన డంకీ మూవీ సూపర్ హిట్ అవ్వాలని అమ్మవారిని ప్రార్ధించారు షారుఖ్. అంతే కాదు తన సినిమాలు విజయం సాధించాలని విడుదలకు ముందే పలు దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. జవాన్‌ సినిమా సమయంలో తిరుమల శ్రీవారిని కూడా ఆయన దర్శించుకున్నారు షారుఖ్. ఇక డంకీ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి డైరెక్ట్ చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ డైరెక్టర్.. పక్కా ప్లాన్ తో చేసిన ఈమూవీ వెయ్యి కోట్లు దాటి కలెక్షన్ల వరద పారిస్తుందని నమ్మకంతో ఉన్నారు టీమ్.