Asianet News TeluguAsianet News Telugu

గరుడవేగ నిర్మాత ఎందుకు మిస్సింగ్?

  • రాజశేఖర్ హీరోగా నటించిన గరుడవేగకు పాజిటివ్ టాక్
  • సక్సెస్ సంబురాల్లో పాల్గొన్న యూనిట్
  • అయితే అసలు కలెక్షన్స్ సంతృప్తినివ్వక నిర్మాత సంబురాలకు దూరం
garuda vega producer koteswar raju missing in celebrations

గత వారం రోజులుగా టాలీవుడ్ లో టాప్ మూవీగా ఉన్నది 'గరుడవేగ' సినిమానే. తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా గుర్తింపు సంపాదించింది. రాజశేఖర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటి అనిపించుకుంది. ఐతే ఈ టాక్‌కు తగ్గట్లుగా ఈ సినిమా వసూళ్లు లేకపోవడం చిత్ర బృందానికి నిరాశ కలిగిస్తోంది. ఆ నైరాశ్యాన్ని బయటికి కనిపించనివ్వకుండా.. ఉత్సాహంగా సక్సెస్ మీట్ పెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు రాజశేఖర్ అండ్ టీమ్. అయితే.. ఇప్పటికీ వసూళ్ళ విషయం నిరాశలోనే ఉన్నట్టు సమాచారం.

 

మౌత్ టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అయింది. రివ్యూలు బాగున్నాయి. అయినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. తొలి రోజు ఆ చిత్రానికి కేవలం రూ.65 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇది షాకింగ్ విషయమే. ఆ తర్వాత కొంచెం వసూళ్లు పుంజుకున్నప్పటికీ... ఈ సినిమా మీద పెట్టిన భారీ పెట్టుబడికి తగ్గట్లుగా అయితే వసూళ్లు లేవు.

 

దీనికి ముఖ్య కారణం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరక్కపోవడమే. ఈ చిత్రాన్ని కేవలం 300 థియేటర్లలోనే రిలీజ్ చేశారు. ఈ సినిమా స్థాయికి ఇది చాలా చిన్న నంబరే. దీనికి ఇచ్చిన థియేటర్లు కూడా అంత గొప్పవేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు మంచి థియేటర్లు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. నిర్మాత కోటేశ్వరరాజు రెండో రోజు నుంచి థియేటర్లు, షోలు పెంచినా... అవి సరిపోలేదు. దీంతో టాక్ కు తగ్గట్లుగా వసూళ్లు రాలేదు.

 

ఇదంతా సరే.. కానీ ఇప్పుడు గరుడ వేగ టీమ్ సక్సెస్ మీట్‌లలో ఈ సినిమా నిర్మాత కోటేశ్వరరాజు మాత్రం ఎక్కడా కనిపించలేదు. తను ముందు నుంచి కూడా ఈ చిత్ర ప్రమోషన్లలో పెద్దగా కనిపించింది లేదు. పాతిక కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మాత ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాత్రం ఒకసారి అలా వేదిక మీదికి వచ్చి రాజశేఖర్ పక్కన కనిపించాడు. ఆ వేడుకలో ఆయన ఎక్కడా లీడ్ తీసుకున్నది లేదు. ఈ సినిమాపై ఏకంగా పాతిక కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మాత ఎందుకు లైమ్ లైట్లోకి రావడం లేదన్నది అర్థం కావడం లేదు.

 

ఈ సినిమాను కోటేశ్వరరాజు మధ్యలో వదిలేస్తే... రాజశేఖర్ ఫ్యామిలీ దాన్ని టేకప్ చేసి పూర్తి చేసిందని... రిలీజ్ వ్యవహారాలు కూడా వాళ్లే చూసుకున్నారని వార్తలొచ్చాయి. ఫైనాన్స్ వ్యవహారంలో కూడా రాజశేఖర్ తన సొంత ఫ్లాట్ తాకట్టు పెట్టి మరీ డబ్బులు సర్దినట్టుకూడా చెప్పారు. ఈ విషయమై విభేదాల వల్లే నిర్మాత తెరముందుకు రావడం లేదా. లేక సరైన స్థాయిలో వసూళ్ళు కనిపించకపోవటంతో నిరాశలో పక్కకు తప్పుకున్నారా అన్నది మాత్రం అర్థం కావటం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios